Friday, 31 May 2013

face book

ప్రియ కారుమంచి ....2/ 03 /2013...

ఒకరికి ఒకరు తెలియని నేస్తాలు 
మొహాలు తెలియని పరిచయాలు 

ఎవరు ఎవరో, ఎక్కడ ఎక్కడో 

అవునో, కాదో తెలియని స్నేహాలు 
నిజమో, కాదో తెలియని మమకారాలు

కొంతమందివి అరువు తెచ్చిన పేర్లు 
ఇంకొంతమందివి అద్దెకి తెచ్చిన మొహాలు 

ఒకరికొకరం కలిసిపోయాం అనుకుంటాం 
వరసలు కలుపుకుని పిలిచేసుకుంటాం 

కష్టాల్లో, కలతల్లో ఓదార్చుకుంటాం
సంతోహాలూ, కలలు పంచుకుంటాం 

నిర్భయకు జరిగిన అన్యాన్ని నిలబెట్టి కడిగేస్తాం 
పక్క ప్రోఫైల్ పరిమళకి ఓ చిలిపి మెసేజ్ కొట్టేస్తాం 

దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా భద్రకాళిలా విరుచుకుపడతాం, 
ఎదుటివారిపై మాటల తూటాలు మనమే పేలుస్తాం ...

పండగొచ్చిందా సందడంతా ఇక్కడే 
పుట్టినరోజు శుభాకాంక్షలు , పెళ్లిరోజు ముచ్చట్లు 

కవితలతో, కధలతో కాలక్షేపాలు
కామెంట్లతో , విమర్శలతో గిల్లికజ్జాలు 

వడపోత మాటలూ , లేనిపోని వినయాలూ 
మంచి అనిపించుకోవాలనే తాపత్రాయాలూ 

కులమతాల గొడవలూ ,రాజకీయ విమర్సలూ,
సవాళ్ళూ,ప్రతి సవాల్లూ ఇక్కడ నిత్యకృత్యాలు ,

బావున్నంతసేపూ అంతా,బానే ఉంటుంది 
అడ్డం తిరిగిందా, ఉందిగా చేతిలో మౌసు 
ఒక్క బటను, ఒక్క క్లిక్కు ...ఫ్రిండ్ షిప్ కట్టు ..

( ఒక్కక్షణం ఆలోచించకుండా చేసే డిలిట్ లను చూసి బాధతో రాసుకున్నాను ఇక్కడ పరిచయాలకి విలువా లేదు , తెగిపోయింది అన్న బాధా లేదు ,ఇంతోటి దానికి ఫ్రెండ్ షిప్ అన్న పేరు ఎందుకు ...ఏవిటో ఈ మనుషులు ,నేనూ అలవాటు పడిపోతున్నా )...........ప్రియ కారుమంచి

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.