Friday, 31 May 2013

face book

ప్రియ కారుమంచి ....2/ 03 /2013...

ఒకరికి ఒకరు తెలియని నేస్తాలు 
మొహాలు తెలియని పరిచయాలు 

ఎవరు ఎవరో, ఎక్కడ ఎక్కడో 

అవునో, కాదో తెలియని స్నేహాలు 
నిజమో, కాదో తెలియని మమకారాలు

కొంతమందివి అరువు తెచ్చిన పేర్లు 
ఇంకొంతమందివి అద్దెకి తెచ్చిన మొహాలు 

ఒకరికొకరం కలిసిపోయాం అనుకుంటాం 
వరసలు కలుపుకుని పిలిచేసుకుంటాం 

కష్టాల్లో, కలతల్లో ఓదార్చుకుంటాం
సంతోహాలూ, కలలు పంచుకుంటాం 

నిర్భయకు జరిగిన అన్యాన్ని నిలబెట్టి కడిగేస్తాం 
పక్క ప్రోఫైల్ పరిమళకి ఓ చిలిపి మెసేజ్ కొట్టేస్తాం 

దేశంలో ఎక్కడ బాంబు దాడులు జరిగినా భద్రకాళిలా విరుచుకుపడతాం, 
ఎదుటివారిపై మాటల తూటాలు మనమే పేలుస్తాం ...

పండగొచ్చిందా సందడంతా ఇక్కడే 
పుట్టినరోజు శుభాకాంక్షలు , పెళ్లిరోజు ముచ్చట్లు 

కవితలతో, కధలతో కాలక్షేపాలు
కామెంట్లతో , విమర్శలతో గిల్లికజ్జాలు 

వడపోత మాటలూ , లేనిపోని వినయాలూ 
మంచి అనిపించుకోవాలనే తాపత్రాయాలూ 

కులమతాల గొడవలూ ,రాజకీయ విమర్సలూ,
సవాళ్ళూ,ప్రతి సవాల్లూ ఇక్కడ నిత్యకృత్యాలు ,

బావున్నంతసేపూ అంతా,బానే ఉంటుంది 
అడ్డం తిరిగిందా, ఉందిగా చేతిలో మౌసు 
ఒక్క బటను, ఒక్క క్లిక్కు ...ఫ్రిండ్ షిప్ కట్టు ..

( ఒక్కక్షణం ఆలోచించకుండా చేసే డిలిట్ లను చూసి బాధతో రాసుకున్నాను ఇక్కడ పరిచయాలకి విలువా లేదు , తెగిపోయింది అన్న బాధా లేదు ,ఇంతోటి దానికి ఫ్రెండ్ షిప్ అన్న పేరు ఎందుకు ...ఏవిటో ఈ మనుషులు ,నేనూ అలవాటు పడిపోతున్నా )...........ప్రియ కారుమంచి

Wednesday, 29 May 2013

నీ నెచ్చెలిని నేను ....

చంద్రుడ్ని సాగనంపేవేళ
నీ చెంత చేరి కాఫీ తాగాలనుంది

హిమసుమాలు రాలి పడే వేళ
నీ జత కలసి నడవాలనుంది
దారంతా రాలిపడ్డ పూరేకులు దోసిలి పట్టి
నీ పాదాలను అర్చించాలనుంది ....

అహర్నిశలు రాష్ట్రం కోసం నువ్వు పడే ఆరాటానికి
చేయి కలిపి బాసటగా నిలపాలనుంది ...

సమసమాజ నిర్మాణం నీ లక్ష్యం అయినప్పుడు
నీ క్షేమం కోసం తపించే నెచ్చెలిని నేను

మానవత్వం నీ మతం అయినప్పుడు
నీ మనసు నిండిన ఆ పరిమళాన్ని నేనవ్వాలనుంది

అందరిక్షేమం కోసం నువ్వు పడే తపనకి
రంగులద్ది , అక్షరాల్ని పేర్చాలనుంది

గమ్యానికి నువ్వు చేరువైనప్పుడు
చిరునవ్వుతో నీకు స్వాగతం చెప్పాలనుంది .....

.........................ప్రియ కారుమంచి ..........

Monday, 27 May 2013

నడి సముద్రమంత నిశ్చలం నావదనం

నడి సముద్రమంత నిశ్చలం నావదనం

నిరతరం ఎగిసి పడే కడలి కెరటాలే
నాలో చెలరేగే సంఘర్షణలు

అలరించే అలల సవ్వడులే
నా మదిని తాకే సంతోషాలు

సుడులు తిరిగే సుడుగుండాలే
నను చుట్టుముట్టే దుఃఖాలు

ఓ మనిషీ! సముద్రమంత సమున్నతం నా వ్యక్తిత్వం

జాలరిలా నాలో జ్ఞాన ఫలాలకై వెతుకు

స్వాతిముత్యాలు ఏరుకో
శంఖనాదాలు ఆస్వాదించు

అంతే కానీ, ఆయిల్ దొంగలా నామదిని చిద్రం చెయ్యకు

నేను నిశ్చలంగా కనిపించే సముద్రాన్నే
కానీ , సునామిని సృష్టించగల శక్తీ ఉంది నాకు...

.................ప్రియ కారుమంచి ...........

Sunday, 26 May 2013

మహా మానవ రధం

ప్రియ కారుమంచి // 30/3 /2013

మహా మానవ రధం సాగుతుంది మునుముందుకు

మహొజ్వల మైన వెలుగు ఒక పక్కా
ముదురు తమస్సు మరో పక్కా

ఈ కర్కశ రధ చక్రాల కిందా
ఈ రక్తంతో తడిచిన చక్రాల కిందా
ఎన్ని మనస్సులు ముక్కలయ్యాయో
ఎన్ని తలలు తెగిపడ్డాయో

అయినా మాంసపు ముద్దల మీదనుంచి
పరుగెడుతూనే ఉంది మానవ రధం
అలుపెరగకుండా , ఆయాసపడకుండా
ఇక్కడ ప్రతినిత్యం ఇదో నిష్టుర సత్యం

హారతవుతున్న ఆడదేహాల
అర్ధనిమీలిత హృదయవిదార గీతాలతో
సంగీతం శంఖనాదమై హోరెత్తుతున్నా
సాగుతూనే ఉంటాం మునుముందుకు
ఆగి చూస్తే వెనుకపడి పోతాం అనే భయం తో

ఆర్ధిక అసమానతలతో మట్టి పాలవుతున్న జ్ఞానం
నిస్సహాయపు పిడికిళ్ళు నేలకు గుద్దుకుని
రక్తపుటేరులు వరదలై మనలను ముచేస్తున్నా
సాగుతూనే ఉంటాం మునుముందుకు
ఆగిచుస్తే వెనుకపడి పోతాం మరి

కళ్ళముందు దుర్మార్గం జరుగుతున్నా
కళ్ళు మూసుకు కూర్చోవడం పాజిటివ్ థింకింగ్
సమాజాన్ని అంగుళాల చొప్పున కోసుకు తింటున్నా
నోరు విప్పకుండా పారిపోవడం పాజిటివ్ థింకింగ్
అంతేనంటారా ?
ప్రశ్నించడం తప్పంటారా ?

................ప్రియ ....................

కవి కవయిత్రి అని ముసుగేసుకో

..................................................................................
కవి కవయిత్రి అని ముసుగేసుకో
అడ్డమైన చెత్తా రాయొచ్చు

అచ్చు తెలుగు టీవీ సీరియల్లా
ఒక ఏడుపు బొమ్మ పెట్టు

ఎలానూ ఉంటారుగా
బదులు కూలీ లైకుగాళ్ళు

అయ్యో పాపం అంటూ వచ్చేస్తారు
భలే ఏడ్చావ్ అంటూ సానుభూతీ కురిపిస్తారు ..

దానికోసం ఏదైనా తాకట్టు పెట్టేయ్
జాతిని అవమానించినా ఇకిలించు
సన్మానాకి అవమానానికి తేడా తెలియని
సంస్కారం లేని సిగ్గుమాలిన జన్మ కదా !

బట్టలిప్పుకుని బజారున పడు
విరహ గీతాలు పాడు ,
ఒక్కడైనా చూడక పోడు
పోయేదేముంది వ్యక్తిత్వమేగా !!

లేదంటే రేపు వాడు బదులు కూలికి రాడు మారి
...............ప్రియ కారుమంచి ....

నేను ....నా రాతలు

మనిషి అయితే వాడికి అన్ని లక్షణాలు ఉండాలి ..

ఎప్పుడూ నేను సంతోషం గానే ఉంటాను అంటే ,
కష్టం చూసి భయపడి పిరికివాడిలా పారిపోతున్నావ్ అని అర్ధం ..

కష్టాన్ని కుడా యధాతధంగా చూడాలి .
అంతే కాని ఇకిలించుకుంటూ పట్టించుకోనట్టు be positive అనకూడదు ..

కోపం వచ్చినా సంస్కారవంతంగా మాట్లాడాలి అనుకుంటున్నావ్ అంటే ,
అదేమీ నాగరికత కాదు నటిస్తున్నావ్ అని అర్ధం ..
సంస్కారం అనే ముసుగు కప్పుకుని నటిస్తూ నాటకాలు ఆడుతున్నావ్ అని అర్ధం .

సాంప్రదాయమో, ఆచారమో అని పేరు పెట్టుకుని వితండవాదం చేస్తున్నావ్ అంటే
నువ్వేమీ సంస్కృతికి వరసుడివి కాలేవు ..
ఆలోచన చచ్చిన వాడివి అవుతావ్ ..
దేవుడి పేరో, మతం పేరో చెప్పి మభ్యపెట్టుంటూ బ్రతికేసే దగాకోరివి అవుతావ్

.......................................................... ...........


రాజకీయ నాయకులు అందరూ దీక్షలు చెయ్యటం తప్పా ,
సరైన alternatives suggest చేయరెందుకూ ?
రైతుకి సోలార్ పవర్ ఇస్తే అయ్యే ఖర్చు ఎంతా ?
సంవత్స్తరానికి ఒక్కో agricultural service పై govtకి అయ్యే subsidy ఖర్చు ఎంతా ?
పగలు అంతా కరంట్ ఉంటే రైతుకి ఇంకా కావాల్సింది ఏముంది ?
apartments లో కామన్ కరంట్ కి solar power వాడటం ఎవరికీ కష్టం ..
shops, malls లో mercury lights కి అయ్యే కరంట్ ఖర్చు ఎంతా ?
solar power వాడితే ఖర్చు ఎంతా ?
solar power alternetive గా వాడితే నష్టం ఎవరికీ ?
ఎందుకు alternative కి వెళ్ళం మనం ....ఇది మన తప్పేగా ...
alternative ఉన్నప్పుడు alternativeకి వెళ్ళకుండా
government ని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా ?




................................................................................................


మహల్లో కొయిల ...ప్రియ

అవును నేను ...''మహల్లో కోయలనే''.....

నాకు తెలుసు !!

నేను కట్టుకున్న కోట బూరుజు కిటికీ కున్న...
''పగిలిన అద్దం''లోనుంచి కనిపించినంత మేరే నా ప్రపంచం అని !!

కానీ నువ్వు ....

ప్రపంచమంతా నీదే అన్నట్టు ఉంటావ్ ....
క్షణం తీరిక లేకుండా ఉంటావ్ ....

నాకు తెలిసింది !!

ప్రపంచమంత కోటని కట్టుకున్నా, నీ కోట బూరుజుకి
అసలు ''అద్దం ఉన్న కిటికి'' ఒక్కటీ లేదని!! ....ప్రియ


............................................................................................................................

ఉదయం ఇంటిముందు వేప చెట్టుపై వాలిన కొయిల
పాడుతుంది సుప్రభాతం తీయ్యగా

సాయంత్రం అరవిరిసిన మరు మల్లెలు
చిందిస్తున్నాయి చిరునవ్వులు స్వచ్చంగా ...ప్రి య ..

......WHAT A LOVELY DAY..........

................................................................................................
20 ఏళ్ళు వచ్చిన బిడ్డలకు నోట్లో అన్నంపెడుతూ dependency అలవాటు చేస్తూ కాదు పెంచాల్సింది
కుటుంబం మీదా , సమాజం మీద ఒక బాద్యత తో మెలిగేలా తయారుచెయ్యాలి ..
సమస్య నుంచి దూరంగా పారి పోయే మనస్థత్వం ఎవరికీ హాని చేయకపోవచ్చు,
కానీ , అలాంటి వాళ్ళు ఈ సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడరు ....
మళ్ళి బిడ్డలని కనీ వాళ్ళని engineering చదివించటానికి తప్పా ..... :)
తప్పుని ఖండించే తత్వం , ప్రశ్నించే సాహసం కావాలి ....
సామాజిక చలన సూత్రాలు విమర్శనాత్మకంగా చూసే దృక్పధం అలవాటు చెయ్యాలి ....ప్రియ

...............................................................................................................................

రాజకీయ నాయకుల కర స్పర్శ కోసం, కంటి చూపుకోసం ఎప్పుడైతే ఈ ప్రజలు
అర్రులు చాచకుండా ఉంటారో అప్పుడే మనం చైతన్యవంతులం అయినట్టు ....

ప్రజాప్రతినిధులని నాయకులుగా కాకా , ప్రజాసేవకులుగా గుర్తించాలి ..
వాళ్ళు చట్టసభల్లో మన తరుపున మాట్లాడటానికి,మన గళం వినిపించటానికి మన ప్రతినిధులుగా మనం పంపిస్తే ''జీతం తీసుకుని పనిచేస్తున్న పనివాళ్ళు ''..

మనల్ని రక్షించటానికి మనం నియమించుకున్నోడికి
సెక్యురిటి వలయాలు ఎందుకు ?కార్ల కాన్వాయ్ లెందుకు ?

ప్రజలకు ''నాయకుడు'' అంటే దండలేసి జేజేలు పలకాలనిపిస్తుంది ,
అదే ''ప్రజాసేవకుడు'' అంటే తప్పు చేస్తే నిలదీయ్యాలనిపిస్తుంది...

''ప్రజాసేవకుడు'' తప్పు చేస్తే ''నిలదీసే స్థాయికి'' నా ఈ దేశ పౌరులు అందరూ ఎదగాలి
అంత ''చైతన్యం'' ప్రతి ఒక్కరిలో రావాలి ...ప్రియ ...



అక్షరం నాకు అమ్మ

ప్రియ కారుమంచి // అక్షరం నాకు అమ్మ

నా అక్షరాలకు 'గాయాలు ఎక్కువ' !

అందుకే నా అక్షరాలు ....

ఆ గాయాల నుంచి స్రవించిన చీకట్లతో తడిచి
ధిక్కార స్వరాలై పోటెత్తి ప్రవహిస్తుంటాయి !!

నా అక్షరాలకు 'ఆత్మవిశ్వాసం' ఎక్కువ ...

అందుకే ఆత్మవిశ్వాసాన్ని చిరినగవుగా ధరించి
మిలమిలా మెరిసి పోతుంటాయి !!

నా అక్షరాలకు 'ఆత్మాభిమానం' ఎక్కువ .....

అందుకే ఆత్మాభిమానాన్ని మణికిరీటంగా ధరించి
సగర్వంగా తలెత్తుకుని ధగధగ లాడుతుంటాయి !!

నా అక్షరాలకు అభిమానం ఎక్కువ ...

అందుకే అభిమానంతో జన హృదయ తంత్రులను మీటుతూ
మృదుమధురంగా సరిగమలు పలికిస్తాయి !!

నా అక్షరాలకు మనుషుల పట్ల మమతానురాగాలు ఎక్కువ ...

అందుకే మమతానురాగాలు పంచుతూ, ప్రేమ పరిమళాలు అద్దుకుని
గలగలమని నవ్వుతూ మానవతా తీరాలలో విహరిస్తుంటాయి !!

నా అక్షరాలకు సమాజం పట్ల బాధ్యత ఎక్కువ ....

అందుకే ధర్మం దారితప్పిన చోట , వాత్సల్యం వరస మారిన చోటా చిరు చురకలవుతాయి
మరీ అవసరమైతే పిడుగుపాట్లూ అవుతాయి

మళ్ళి చెప్తున్నాను

అక్షరం నాకు ' అమ్మ'

అమ్మతనం ఒక వెచ్చని కన్నీటి చెమ్మ !!

.........................మీ ప్రియా కారుమంచి ........

మౌనం మంచిదే .... మాట ఇంకా గొప్పది .....

మౌనం మంచిదే .... మాట ఇంకా గొప్పది ..... 

అందుకే 
మాట్లాడాలి .... 
మాట్లాడుతూనే ఉండాలి .... 

ప్రపంచంలో ఉన్న మాటలన్నీ మాట్లాడీ ,మాట్లాడీ 
కొత్త మాటల కోసం గుండె పరితపించాలి .... 

మాట్లాడటం మరచిపోతానేమో అనే భీభత్సపు ఒంటరితనం 
గొంతు వెనుక మాటువేసి ఉంటుంది / జాగ్రత్త ....

మాటల్ని ప్రేమించండి
మాటల్ని పంచండి
మాటల్ని పోగేయ్యండి

మాటలను పిట్టలుగా చేసి
జీవనగగనం లోకి విసిరేయ్యండి

మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు
పెదాలతో కాదు హృదయంతో మాట్లాడండి

మాటలను పాటలుగా పాడే ఋతువు కోసం
మనసును కోకిలగా మార్చండి ......

................... ప్రియ కారుమంచి ........

నేను నా ఫేస్బుక్ రాతలు ...

1 ) ఒకప్పుడు తమ తల్లులకు లేని అవకాశాలు , అవగాహన తమకు ఉన్నా మళ్లీ తమ బిడ్డలు పట్ల పాత తరం వలే ప్రవర్తిస్తున్న ఇప్పటి తల్లుల అబద్రతా భావం , దాని వెనుక మూల కారణం చూస్తే దుఖం కలుగు తుంది....


2 ) మనం ఈ ప్రాణం ఉండగా ప్రాణ ప్రదం గా చూసుకున్న ఏ వస్తువూ మనం పోయాక మన గురించి గుర్తు చేసుకోదు.... మనం కొన్ని మనసులలో మిగిల్చి పో యిన తీపి గుర్తులే మన జ్ఞాపకాలై మిగిలిపోతాయి ...


3) మనసు చీకటి లో వెతుకు తున్నా ముచ్చటైన నీ మోముని !!
అది నా మనసులో వెన్నలై విరబూస్తుంటే 
ఎక్కడో వెతుకుతున్న మనసుకి 
నీ రూపం నాలోనే ఉందని ఎలా చెప్పను చెలీ!!!


4) రాత్రి నాకు చెప్పకుండా వచ్చి వెళ్లి పోయింది ''వాన చినుకు''....
మళ్లీ నా మీద పగ పట్టిన సూరీడు పకపకా నవ్వుతున్నాడు ....
సూరీడు కి చెయ్యి అడ్డు పెట్టే మగధీరుడు ఎవరైనా ఉన్నాడా భూమి మీదా !!!



5) మాతృత్వం గొప్పది మాతృమూర్తి కాకపోవచ్చు.... 
తోడబుట్టిన వాళ్ళు నీచులు కావచ్చు తోడు వొచ్చిన స్నేహం గొప్పది .....

6)ఒక్కసారి మీ ఊరు పోయి రండి అని గజల్ శ్రీనివాస్ గారు గొంతెత్తి చెప్తున్నారు చూద్దాం కదా అని వెళ్ళనా !గతుకుల రోడ్డు ఇరుకు సందులు అంతకంటే ఇరుకు మనస్తత్వాల మనుషులు తప్ప ఏమి కనిపించలేదు ..సిటీస్ లోని హిపోక్రసి పల్లెల్ని తాకుతుంది .....ప్రపంచం తెలియక ముందు మనుషుల మద్య ఆప్యా యతలు ఉండేవి దేశాలు దాటి పోతున్న మనిషి మనుసుల మద్య గోడలు కట్టు కోవడం మొదలెట్టాడు నా చిన్నప్పటి నా పల్లె టూరిని ఎవరు మింగేసారు ??

7) ఈ ప్రపంచం లోని ఆధునిక ''మనువులు'' అందరికీ విన్నపం... విజ్ఞప్తి.... కాదు కాదు...... హెచ్చిరిక..... ముందు మమ్మ్లల్ని మనిషులు గా చూడండి.....ఆ తరువాతే మా జాతి........
అసలే మాకు సహనం ఎక్కువ అంటా .....సున్నితం గా ...ఉండాలంటా ఇంకా ఇలాంటివే ఏవేవో చాలా చాలా సహజ లక్షణాలు మాకు సృష్టి ప్రసాదించి దంట...అందుకే ఇలా ఇంత సున్నితం గా మీకు విజ్ఞప్తి (హెచ్చరిక)చేసుకుంటున్నాం .ప్రతి దానికి
అడ ...మగా తేడా తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని మనవి .....

8) రాత్రి నాకు చెప్పకుండా వచ్చి వెళ్లి పోయింది ''వాన చినుకు''....
మళ్లీ నా మీద పగ పట్టిన సూరీడు పకపకా నవ్వుతున్నాడు ....
సూరీడు కి చెయ్యి అడ్డు పెట్టే మగధీరుడు ఎవరైనా ఉన్నాడా భూమి మీదా !!!

9) ఒకప్పుడు తమ తల్లులకు లేని అవకాశాలు , అవగాహన తమకు ఉన్నా మళ్లీ తమ బిడ్డలు పట్ల పాత తరం వలే ప్రవర్తిస్తున్న ఇప్పటి తల్లుల అబద్రతా భావం , దాని వెనుక మూల కారణం చూస్తే దుఖం కలుగు తుంది....

10) మనం ఈ ప్రాణం ఉండగా ప్రాణ ప్రదం గా చూసుకున్న ఏ వస్తువూ మనం పోయాక మన గురించి గుర్తు చేసుకోదు.... మనం కొన్ని మనసులలో మిగిల్చి పో యిన తీపి గుర్తులే మన జ్ఞాపకాలై మిగిలిపోతాయి ...

11) '' వచ్చిపోయే చుట్టం లా ఉంటుంది సమస్య .....
పగ మాత్రం రోజూ పేర్చే చితి లా ఉంటుంది ''....

12) ఏ మర్యాద ముసుగు మాటునా, 
ఏ మాయదారి నాటకం దాగుందో 
ఏ మానసిక రోగం ముదురుతుందో
ఎవరికీ తెలుసు !!!!...........................ప్రియ
...........................................................................

13) అవును నేను పబ్లిసిటి కోసమే పని చేస్తా _______R.G.V...

రామూ కి పబ్లిసిటీ ఇవ్వటం కోసం ఛానల్స్
ప్రియకి పబ్లిసిటీ ఇవ్వటం కోసం కొన్ని ఫేక్స్ పోటీ పడుతుంటాయి ఎప్పుడూ ..

పండగ చేసుకోండి .......పని మాత్రం బాగా చెయ్యండి 
మీ శ్రమే మాకు పబ్లిసిటీ .......ప్రియ
...............................................................................

I LOVE MY DEAR FAKES .....

14) ఎండుటాకు ఎంత ఎత్తుకు లేచినా ....

చివరకు చేరాల్సింది చెత్తకుప్పనే......DIRTY PICTURE 

( fake ids తో చెత్త రాతలు రాసేవారు pages close చేసుకోవాల్సిందే )
SOCIAL NET WORK LO DIRTY PICTURE .....



15) పుట్టిన క్షణమే నిశ్చయింపబడుతుంది మరణం

నిరంతర నటనతో నాటకం చేసుకోవటం ఎందుకు జీవితాన్ని

నిజాయితితో బ్రతికితే ఆత్మతృప్తి అయినా మిగులుతుంది చివరకు .....ప్రియ


16) జెలసీ.....జైలు మెట్లు ఎక్కించే టంతగా ముదరకూడదు .....ప్రియ కారుమంచి


17) మీరు ఎప్పుడైనా చెట్టును పలకరించారా ?

పలకరించి చుడండి .....
అది మీకు తనదైన బాష లో మీకు హాయ్ చెప్తుంది ...

మొత్తం సృష్టి చాలా సున్నితమైనది .. 

మొత్తం సృష్టిని నీ స్నేహితునిగా ఎందుకు మార్చుకోకూడదు ? 
అంత గొప్ప సామ్రాజ్యాన్ని ఎందుకు కోల్పోవాలి .........ఓషో ..


18) ఒంటరివాడు బిక్షగాడి లాంటివాడు ..
అతని హృదయం బిక్షాపాత్ర ...
( ప్రేమకోసం అందరిని అర్ధిస్తూ ఉంటాడు )

ఏకాంతంలో ఉన్నవాడు చక్రవర్తి ...
బుద్ధుడు ఏకాంతంలో ఉంటాడు .......ఓషో ....


19) జీవితంలో

నీకు చేతనైతే ఉన్నత శిఖరాలను అధిరోహించు

ఇంకా నీకు వీలైతే ఆకాశపు అంచులను తాకు

ఏం చేసినా , ఎంత ఎదిగినా

'' మనిషిని అన్న స్పృహ మాత్రం కోల్పోకు''


20) కులాన్ని బట్టి మనిషికి సంస్కారం రాదు .....

కులాన్ని బట్టి మనిషి గొప్పవాడు అవడు ....

ప్రవర్తనని బట్టి మనిషి స్థాయి ఉంటుంది .....

నా ద్రుష్టిలో నీచ ప్రవర్తన కలిగిన వాడు నిమ్న కులస్థుడు 
సంస్కారం నేర్పే అమ్మా నాన్నా లేని అనాధ ..... ప్రియ


.........................................................................................

''నగ్న పాదాలతో నేలపై నడిచి చూడు
ఆ భూమాతతో ముచ్చట్లాడినట్టే ఉంటుంది
కష్ట సుఖాలు, జ్ఞాపకాలు ఆ తల్లి తో కలబోసుకున్నట్టే ఉంటుంది ....
ఆకాశమంత ఎత్తు ఎదిగినా నిలబడేది నేల పైనే అని గుర్తుకొస్తుంది '' ....
................................................ప్రి య ....

...........................................................................................

''కాలం చెక్కిట జారిన వెచ్చని ఓ కన్నీటి చుక్కా
తుఫానులు సునామీలు వస్తే రానీ అది నీకో లెక్కా''
....తాజ్ మహల్ .........................ప్రియ .....

..........................................................................................

ఏంట్రా నీ గొంతులో ఆ తడి అని, గుర్తించి అడిగే ఒక స్నేహం
దూరంగా ఉన్నా చాలుగా !!......ప్రియ




సానుభూతి

నిన్న కమల్ అనే ఒక ఫ్రెండ్ తో మాట్లాడు తుండగా అతను ఒక సున్నితమైన విషయాన్నీ చాలా సూటిగా చెప్పటం జరిగింది అది ఏంటంటే...... చాలా పాత మాట ఒకటుంది.." నాకోసం చెమ్మగలిగే నయనమ్మ లేదు" మీరందరు ఈ వ్యాక్యాన్నిచదివే ఉంటారు..! ఇలాంటివన్ని "self pity" కోరుకునేవే..!! నాబాదలు వినడానికొ ఫ్రెండ్ కావాలనో, లేక ఒక ప్రియురాలు కావలనో లేక ఒక ప్రియుడు కావాలనో అనుకొంటూ ఒక సెల్ఫ్ పిటిలో బతుకుతూ ఉంటారు..!సమాజంతో పంచుకోవలసినది సామాజిక భాద్యతే కాని..మన వ్యక్తిగత జీవితాన్ని సమాజం మీద రుద్ది...దాని నుండి సానుభూతో లేక..మరొక టో పొందాలనుకుని ఆశించి ఆత్మసంతృప్తి పొందుదాం అనుకొంటే దానర్థం మనకు తెలీకుండానే మనం ఒక ఐడెంటెటీ క్రైసిస్‍౬తో సానుభూతిని ఆశిస్తున్నట్లే..అవుతుంది.!!నాకు ఇది చాల నిజమే కదా అనిపించింది ....ఏవంటారు ???

పంచాంగం

మహల్లో కోయిల

ఆకాశాన్ని తాకాలని 
ఆశ పడ్డావ్ కానీ 
నా మనసు లో ఎగిసే 
భావాల్ని కుడా చేరలేక పోయావ్ !!

బ్రతుకు సంద్రాన్ని గొప్పగా 
ఈదాలని ఆరాట పడ్డావ్ కానీ 
నీ విరహంతో తడిచిన 
నా గుండె తడిని చూడలేక పోయావ్ !!

నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసే విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ !!

అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిలనే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో !!
***** ప్రియ కారుమంచి *****

.ప్రియ కారుమంచి ....1

తీరికగా ఉన్నాం కదా , భలే ఉంటాయి అని
వేరేవాళ్ళ జీవితాల మీద కధలు అల్లడం మొదలెడితే 
అల్లిన కధలన్నీముళ్ళ తీగలా చుట్టుకుని 
చివరకు సాలేగుడులో చిక్కుకున్న ఈగలా 
ప్రాణం వదలాల్చి వస్తుంది ..........ప్రియ కారుమంచి ....

ప్రేమ ఒక నరకం


దెబ్బతిన్న పావురం మనిషి ని చూస్తేనే బెదిరి పోతుంది
వేటగాని వేటుకు గుండె మెలిపెడుతుంటే బిక్కు బిక్కు మంటుంది

ఎవరికేం హాని చేసింది .....ఎవరి ప్రేమ కావాలనుకుంది
మంచిమాటలతో మచ్చిక చేసేది , అరచేతుల్లో పెట్టి లాలించేది
కమ్మని శరీరం కోసం అని తెలియదు గా పాపం
పిచ్చి పావురం మృగానికి మచ్చికైయింది ..మరణయాతన పడుతుంది

పలకరింపుకే పులకరించే అల్పసంతోషి
అయినవారిని కాదని మేధావిమనిషి సరసన చేరాననుకుంది
మురిసిపోయింది

బ్రతుకును బలికోరే బోయవాడని తెలియక నమ్మి వచ్చింది
ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తుంటే ఏమని సముదాయించను
గూడు చెదిరి బెదురుతున్న బంగారుతల్లిని ఎలా ఓదార్చను

మంచితనం మాయమైందని, మ్రగతనమే మనిషితనమైనదని
ఎలా చెప్పను పిచ్చిమాతల్లికి
ఏమని బుజ్జగించను ఈ బుజ్జి పావురాన్ని !!

ప్రేమ పేరుతో చేసే మోసం దారుణం.. అది చేసే గాయం నరకం

స్నేహం


మన స్నేహం మనం ఉన్నంత కాలం ఉండాలి
ఎప్పటికి
మంచులా కరిగి పోకూడదు
స్వచ్చమైన ముత్యమై మెరవాలి
సుమంలా వాడిపోకూడదు
మొక్కలా చిగురిస్తూనే ఉండాలి,
''ఓం'' కారంలా,
ప్రకృతి పాడే ప్రణయ సంగీతం కావాలి
నా మది ఆలాపించే మౌనగీతం నీది
నీ తలపుల్లో పరిమళించే ఆలోచన నాది
ఆకృతి దాల్చిన ఆత్మస్థైర్యమై నువ్వు ,
హుందాగా, స్వరమధురిమనై నేను
మన మాటలే కాదు ,
రాతలూ బంగారంలా ఉండాలి
నలుగురికీ ఆదర్శంగా నిలవాలి
మనం ఉన్నా, లేక పోయినా ,
మన స్నేహం
సూర్యుడు వెలుగులా ప్రకాశిస్తూనే ఉండాలి
ఈ రోజు నా చివరి ఆలోచన ,
రేపటి నా మొదటి ఆలోచన
నువ్వే కావాలి...
నా అందమైన కావ్య రచనకి,
''ఏకాక్షరివి'' నువ్వు
రచిస్తూనే ఉంటా నేను
.స్నేహాక్షరనియే ...
నిరీక్షిస్తూనే ఉంటా నీకోసం
......అభిసారికనై..... !!

...............ప్రియ...........

ప్రకృతి ..నేను //

ప్రియ కారుమంచి // ప్రకృతి ..నేను //
3 /12 / 20012

ప్రకృతే .........పాఠశాల

పరిసరాలే.... పుస్తకాలు !

కడలి కెరటం చెప్పింది
పడేది మళ్లీ లేచెందుకేనని !

దుమికే జలపాతం చెప్పింది
కిందపడ్డా ముందుకు సాగెందుకేనని !

కదిలే నది చెప్పింది
గమనం గమ్యం కొరకేనని !

సప్తవర్ణాల హరివిల్లు చెప్పింది
రంగులలోకం నిజం కాదని !

నిశిరాత్రి చందమామ చెప్పింది
చీకట్లో చిరుదీపం కమ్మని !

మెరిసే నక్షత్రాలు చెప్పాయి
మంచి నేస్తాలని పెంచుకొమ్మని !

పచ్చని అడవి చెప్పింది
కుందేళ్ళ తో పాటూ తోడేళ్ళూ ఉంటాయాని !

పాడే కోయిల చెప్పింది
మనసు తో మాటాడాలని !

నాట్యమాడే మయురం చెప్పింది
ఆనందం నాలోనే ఉందని !

ఎగిరే గువ్వ , ఈదే చేప ఇలా అన్ని చెప్పాయి
నింగి ఎత్తు , సంద్రం లోతు చూసి భయపడోద్దని !

కురిసే వానచినుకు చెప్పింది
చివరికి చేరేది మట్టిలోకేనని !

ప్రకృతి మాత్రం తన మనసు విప్పి అన్నీ చెప్పింది నాకు
సాటి మనిషి మనసు మాయా , మర్మం మాత్రం
..........నాకు తెలియటంలేదు........ !!

స్త్రీ అంటే నీతో పాటూ సమానమే

ఆడదాన్ని ఆదిశక్తీ లా పూజించాల్సిన అవసరం లేదు
ఆబల, అని అవమానిస్తూ , ఆసిడ్లు పోయకుండా ఉంటే చాలు

మహిళకి వెనకుండి నడిపించే మార్గ దర్శి, అన్న కితాబులు అక్కరలేదు
ఆలోచన లేని బొమ్మ లా నీ వెనకుండి, ఆడాలని ఆశ పడకుండా ఉంటే చాలు

స్త్రీ అంటే , సహానానికి సౌజన్యానికి మారు పేరు అన్న అందలాలు అక్కర లేదు
స్త్రీ అంటే నీతో పాటూ సమానమే అన్న ఇంగితం ఉంటే చాలు !!

..................ప్రియ కారుమంచి ...........................

ఎవరు గొప్ప

సినిమాల పేరు తో అర్ధనగ్న ప్రదర్శన
కవిత్వం పేరు తో అంగాంగ వర్ణన
ఎడ్వర్ టైజ్ మెంట్స్ పేరుతో అశ్లీలం

ఒక స్త్రీ ని ఎందుకు ఇలా పిచ్చివాళ్ళ లాగా ఆసభ్యంగా చిత్రిస్తున్నారు

అప్పట్లో భూమి ఖాళి గా ఉన్నప్పుడు ,ఫ్యామిలి ప్లానింగ్ అవగాహన లేనప్పుడు ,
స్త్రీ లు పిల్లలను కంటూ ఉండే వారు.....

మగ వాడు, పని పాటా లేకా , స్త్రీ ని అంగాంగ వర్ణణ చేస్తూతిన్నది అరక్క ,కవిత్వం చెప్పేవాడు

అసలు సృష్టి లో ఏ ప్రాణి ని చూసినా మగవే అందంగా ఉంటాయి
(మగ సింహాలు ,పులులు , పొట్టేళ్ళు ,మగ నెమలి , మగ కొయిల.ఆకరికి మగ కుక్క కుడా )

కానీ, ఏదో స్త్రీత్వమే అందమైనదన్నట్టూ ,ప్రేమించ బడేది అన్నట్టూ .
మగవాడే ప్రేమించే వాడు అన్నట్టు మనల్ని మిస్ గైడ్ చేసారు

అసలు ఒక స్త్రీ మగ వాడిని ఎంతలా ప్రేమిస్తుందో మగ జాతి ఎప్పటికీ తెలుసుకోలేదు

అందుకే పాపం ఆడది అసహాయరాలు అయి ,మగవాడు పెద్ద పోటు గాడు
అని జనానికి తెలియకుండా పొయింది పాపం ...
మగవాడు స్త్రీ పాదాల దగ్గర పడి ఉండి , ఈ వర్ణనలతో కాలక్షేపం చేస్తున్నాడు ...
ఇక నుంచి అయినా స్త్రీ ని పూజించటం మానేయండి , మహిళా కుడా మీతో సమానమైనదే
స్త్రీ ని ఎక్కువ చేసి పూజించి, ఉన్మాదులు అవకండి , మమ్మల్ని మాలాగా బ్రతకనివ్వండి ....

.............................. ...ప్రియ కారుమంచి