Tuesday, 20 November 2012

కరగని స్వప్నం ....


ప్రియ కారుమంచి // కరగని స్వప్నం ....

మనిషితనం అంటే మాయతనం అనుకున్నా
నిన్ను చుసాకేగా తెలిసింది మంచితనం అని


అంతా స్వార్థమని అన్నీ కలుషితమని
భయంతో బెదిరే నా కళ్ళకి

బాధతో కుమిలే నా గుండెకి
రంగుల ప్రపంచాన్ని చూపిస్తావు
కలల లోకాన్ని సృష్టిస్తావు
కల్లోలాన్ని కడిగేస్తావు

నిశ్శబ్ద నిరుత్తరురనై నిశీధి లో నేనుంటే
అక్షరతంత్రులను మీటి భావాన్ని వెలిగిస్తావు
భావాన్ని పంచుకుందామని కవిత్వం రాసుకుందామని
కలం పట్టిస్తావు
పదం పలికిస్తావు
జీవన రాగం పాడిస్తావు

కలవరంగా నేనుంటే కవితలా అల్లుకుంటావు
ఆవేశం అస్త్రమైతే ఆలోచన అక్షరమంటావు

అమ్మ చూపే ఆత్మీయత , నాన్న చూపే ఆప్యాయత
తోడై కదిలే అడుగుల వాస్తవికత
ప్రేమై కురిసే చూపుల ఆస్తికత
అన్ని వర్ణాలను ఏకాక్షరం చేసి
నా ముందు నిలబడతావు

నీవొక కరగని స్వప్నం

21 /11 / 20012


2 comments:

  1. ప్రియా,
    మనిషితనాని మెచ్చావు అంటే మానవత్వం నీలో మెండుగా ఉంది.
    ఆవేశం అస్త్రం కాదు అక్షరమే నీ అసలైన అస్త్రం.
    ఇలా ఎన్నో రాయాలని మనసారా కోరుకుంటున్నాను.

    ReplyDelete
  2. నీ అభిమానం ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలి అనుకుంటున్నా ...
    నా ఆవేశాన్ని అక్షర దారి పట్టించినది మీరే గా ....:)
    thank u friend ....

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.