Sunday, 26 May 2013

మహా మానవ రధం

ప్రియ కారుమంచి // 30/3 /2013

మహా మానవ రధం సాగుతుంది మునుముందుకు

మహొజ్వల మైన వెలుగు ఒక పక్కా
ముదురు తమస్సు మరో పక్కా

ఈ కర్కశ రధ చక్రాల కిందా
ఈ రక్తంతో తడిచిన చక్రాల కిందా
ఎన్ని మనస్సులు ముక్కలయ్యాయో
ఎన్ని తలలు తెగిపడ్డాయో

అయినా మాంసపు ముద్దల మీదనుంచి
పరుగెడుతూనే ఉంది మానవ రధం
అలుపెరగకుండా , ఆయాసపడకుండా
ఇక్కడ ప్రతినిత్యం ఇదో నిష్టుర సత్యం

హారతవుతున్న ఆడదేహాల
అర్ధనిమీలిత హృదయవిదార గీతాలతో
సంగీతం శంఖనాదమై హోరెత్తుతున్నా
సాగుతూనే ఉంటాం మునుముందుకు
ఆగి చూస్తే వెనుకపడి పోతాం అనే భయం తో

ఆర్ధిక అసమానతలతో మట్టి పాలవుతున్న జ్ఞానం
నిస్సహాయపు పిడికిళ్ళు నేలకు గుద్దుకుని
రక్తపుటేరులు వరదలై మనలను ముచేస్తున్నా
సాగుతూనే ఉంటాం మునుముందుకు
ఆగిచుస్తే వెనుకపడి పోతాం మరి

కళ్ళముందు దుర్మార్గం జరుగుతున్నా
కళ్ళు మూసుకు కూర్చోవడం పాజిటివ్ థింకింగ్
సమాజాన్ని అంగుళాల చొప్పున కోసుకు తింటున్నా
నోరు విప్పకుండా పారిపోవడం పాజిటివ్ థింకింగ్
అంతేనంటారా ?
ప్రశ్నించడం తప్పంటారా ?

................ప్రియ ....................

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.