ప్రియ కారుమంచి / 11/4/2013...
అతడికి
అన్ని కాలాలూ ఒకటే
ఎండకు ఏండీ , వానకు తడిచి , ఆకలేస్తే ఏడ్చి
పని దొరికితే పిడికెడు మెతుకులు తిని
నేలతో సహజీవనం సాగించే వాడికి
అన్ని కాలాలూ ఒక్కటే ...
ఆమెకి
అన్ని కాలాలూ ఒకటే
అనాదికాలపు పాతివ్రత్యపు ఖైదులో మగ్గుతూ
పిల్లలను కనే యంత్రమై , ఆకళ్ళను తీర్చే మంత్రమై
విషాదం మింగిన ఏకాంతంలో
ఏడుపు సవ్వడి ఎవ్వరికీ వినిపించకుండా
లోలోపల , తన లోపల కుమిలి పోయే , రగిలి పోయే ఆమెకు
ఆని కాలాలూ ఒక్కటే
కొయిలా
ఈ ఉగాది వేళా
ఎవరి హృదయ నాదాలను గానం చేస్తావ్ నువ్వు
ఏ దుఖః వేదాలను ప్రవచిస్తావు నువ్వు
నాలుగు మామిడాకులు కట్టగానే తోరణం అయిపోతుందా
నా గుమ్మానికి రవ్వంత పసుపు రాసినంత మాత్రానే అంతా శుభం జరుగుతుందా
పంచాంగ శ్రవణంతో పచ్చని వాసంతం వచ్చేస్తుందా
ఓ కొయిలా !
నీ పాటంటే నా కిష్టం
నాకిష్టమైన పాటలో నా ప్రపంచాన్ని ప్రతిధ్వనించ నివ్వు
నా తోటి వారి వేదనలను వినిపించనివ్వు
కుహు కుహు మనే నీ పాటలో
కూలీ నాలీ చేసుకునే జీవితాలను వినిపించనివ్వు
ఓ చైత్రమా !
ఎన్నాళ్ళని తోటల్లో విరబూస్తావ్
ఒక్కసారి
ఒక్కసారి నా దేశపు ఆడపిల్లల నవ్వుల్లో వసంతమై వెల్లి విరియవా
ఒక్క సారి
ఒక్కసారి శాంతి సంకేతానివై ప్రపంచ పటంపై పతాకమై ఎగరవా
అందరు కవుల్లా నేను అలవాటు కొద్ది పొగడలేదు
అన్నో ఇన్నో మల్లె పూలతో అరకొరగా రాజీ పడలేదు
ఆమని రాగంలో కోకిల గానం ఇష్టమే
ఆశల మేఘం లో ఉరుముల తాళమూ ఇష్టమే
ఒక్కసారి
అస్థవ్యస్థమైన జనజీవనం కేసి చూసీ ఒక్క పాట పాడవా
కొయిలా
నా ప్రియమైన కొయిలా
ఈ మానవ జాతికి ప్రియాతి ప్రియమైన కొయిలా
ఈ ఉగాది వేళా నువ్వు పాడే పాటలో
మోడువారిన జేవితాలు మావికోమ్మలై చిగురించాలి
కారు చీకటి బ్రతుకులు కాంతివంతమై వెలగాలి
తీపి ........తేట తేట తెలుగు తియ్యందనమై
కారం.... ...మచ్చలేని మానవతకు మమకారమై
ఉప్పు ........మనిషికీ మనిషికీ మద్య విశ్వాస వారధియై
పులుపూ ...కోరికల పాలిటి అదుపు దండమై
వగరూ .....తలపోగారును దించే సాధనమై
చేదూ ...జీవన వేదనలను దాటించే సోపానమై
ఈ విజయనామ సంవత్శర ఉగాది
పచ్చదనపు పతాకమై ఎగరాలి
మరో ఉగాది వచ్చేవరకు
మనసు మధుర గీతమై సాగాలి..........

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.