చలం .....చలం ...చలం
గుడిపాటి వేంకటాచలం
చలానికి ఇవ్వాల్టికి 119 ఏళ్ళు
ఎంతోమంది జీవితాలను వెలిగించిన మణి దీపాలు మన చలం రచనలు
ఏదో మాటలను ఏర్చికూర్చి రాసిన రాతలు కావవి
చలం హృదయాన్ని చీల్చుకొచ్చి సూటిగా మన హృదయాలను తాకి
ఉన్నఫళంగా మనం అనుకుంటున్న భద్రమైన జీవితాలని ,
మన మూఢ నమ్మకాలను ప్రశ్నించే శరాఘాతాలు అవి....
తన జీవితమంతా ప్రేమకోసం పరితపించి అన్వేషించి , అన్వేషించి మధనపడి
తన జీవిత రధచక్రాల కింద నలిగి స్రవించిన నీలి రక్తాన్ని కలంలో నింపి
మనకోసం ముద్రించిన ప్రేమాక్షరాలవి .....
అక్షరాల పాండిత్యం కాదది
సంవత్సరాల మూగ వేదన
అంధకారంలో అన్వేషణ
రహస్య హృదయాంతరాల విషాదం
ఎవరితోనూ చెప్పుకోలేని హృదయ వేదన
మన ముందు నిర్భీతిగా పరిచాడు చలం
....................కాబట్ట ే .....................
‘’చలం మనకొక సంచలనం ‘’అయ్యాడు ..
‘ స్త్రీ స్వేఛ్చ ‘ అనే ఊహేనే ఈ దేశం ఎరగని రోజుల్లో
స్వేఛ్చ మళ్ళి ‘స్త్రీ కి స్వేఛ్చ ‘అనే మాటే భూతంలా పరిగణించే స్థితిలో సమాజం ఉన్నప్పుడు
‘’స్త్రీ కి కూడా శరీరం ఉంది
దానికి వ్యాయామం కావాలి
ఆమెకి మెదడు ఉంది
దానికి జ్ఞానం కావాలి
ఆమెకి హృదయం ఉంది
దానికి అనుభూతులు కావాలి’’ -----చలం స్త్రీ ....
అంటూ ఈ నీతిబాహ్యమైన మూర్ఖపు సమాజానికి
అనివార్యమైన ఒక సామాజిక అవసరం గురించి చాటిచెప్పాడు......
స్వేచ్చా కాంక్ష ఉన్నంత కాలం చలం సజీవంగా ఉంటాడు
మన మద్య చరిస్తూనే ఉంటాడు
మళ్ళి మళ్ళి చరిత్ర తిరగ రాస్తూ ఉంటాడు .....ప్రియ కారుమంచి ......

....................కాబట్ట

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.