Sunday, 26 May 2013

మౌనం మంచిదే .... మాట ఇంకా గొప్పది .....

మౌనం మంచిదే .... మాట ఇంకా గొప్పది ..... 

అందుకే 
మాట్లాడాలి .... 
మాట్లాడుతూనే ఉండాలి .... 

ప్రపంచంలో ఉన్న మాటలన్నీ మాట్లాడీ ,మాట్లాడీ 
కొత్త మాటల కోసం గుండె పరితపించాలి .... 

మాట్లాడటం మరచిపోతానేమో అనే భీభత్సపు ఒంటరితనం 
గొంతు వెనుక మాటువేసి ఉంటుంది / జాగ్రత్త ....

మాటల్ని ప్రేమించండి
మాటల్ని పంచండి
మాటల్ని పోగేయ్యండి

మాటలను పిట్టలుగా చేసి
జీవనగగనం లోకి విసిరేయ్యండి

మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు
పెదాలతో కాదు హృదయంతో మాట్లాడండి

మాటలను పాటలుగా పాడే ఋతువు కోసం
మనసును కోకిలగా మార్చండి ......

................... ప్రియ కారుమంచి ........

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.