Thursday, 6 December 2012








ప్రియ కారుమంచి // నేల బిడ్డ

దుక్కిదున్ని, విత్తునాటి వర్షపు చినుకు కోసం ఆశగా చూసే రైతన్నా
ఆరుగాలం కష్టపడ్డా గిట్టుబాటు ధర వస్తుందని, నీకేది భరోసా ..
కష్టానికి ఫలితం వస్తుందో రాదో తెలియకుండా కష్టపడే కార్మికుడివి నీవు

గంట కూలికి ఇంత రేటు
రోజుకూలికి అంత మొత్తం
సూటుబూటు బాబులకేమో నెల ముందే చెక్కులు
తిండిపెట్టి కడుపునింపే నీకేమో ఆకలి నేలచూపులు

విత్తునాటిన దగ్గర నుంచీ అన్నీ ఎదురుచూపులే 
సర్కారోడు కరెంట్ ఇవ్వను పొమ్మంటాడు
బోరుచూస్తే నీరులేదు  ...పైకిచూస్తే చినుకురాలదు
కన్నుమూస్తే కాబోలి వాడు ...పక్కకెళ్తే పురుగుమందుల డీలరుగాడు

కన్నతల్లికి లెక్ఖ కట్టి ముసలి తనపు ఇళ్ళకు అప్పచెప్తున్న హైటెక్కు గాళ్ళకేం తెలుసు
నీకు కన్నతల్లిని మించిన తల్లి ఈ నేలతల్లని,
నీ కన్నీళ్లను తనలో ఇంకించుకుని నిన్ను ఓదార్చే కన్నతల్లని

పంట పండకా ,పెరిగిన అప్పు కట్టలేకా
ఆత్మాభిమానం చంపుకోలేకా , దళారీల్లా ఇన్సాల్వెన్సి దారి  పట్టలేకా
చేతిలోఉన్న పురుగుమందు డబ్బావంకా , కన్నబిడ్డల వంకా
మార్చి మార్చి చూసే నీ నిస్సహాయత ఏ సర్కారోడికి అర్ధమైందన్నా

నీ శవాన్ని చూసి, వొళ్ళు బలిసి ఆత్మహత్య చేసుకున్నావంటే
కొడవలి చేతబూని ఉన్న ఓ రైతన్నా కోసేందుకు ఎలాగూ పంట లేదు
అన్నవాడి నాలుక తెగ్గోసే సత్తువలేక బక్కచిక్కి పోయావు కాదన్నా రైతన్నా

ఆలిబంగారం తాకట్టుపెట్టి తెచ్చిన మల్టీ నేషనోడి విత్తనం మొలకెత్తిందా
కర్మగాలి పంట కళ కళ లాడిందా ,
నెత్తిమీద యముడై  కూర్చున్న పురుగుమందుల కంపెనివాడు
అన్నీ దాటి గింజ చేతికొచ్చిందా
దారికాచి దోచుకునే దళారి వాడు
గుమ్మం ముందు కాచుకు కూర్చున్న కాబోలివాడు

నీ కష్టం కళ్ళముందు కొచ్చేటప్పటికి
వాళ్ళ పెళ్ళాల చేతులకేమో వజ్రాలగాజులు వెలిస్తే
నీ కట్టుకున్న దాని పూస్తే మాయమవుతుందేంటన్నా  రైతన్నా !!

7/ 12/ 2012
.....................

Thursday, 29 November 2012

మృగతనం




దెబ్బతిన్న పావురం మనిషి ని చూస్తేనే బెదిరి పోతుంది
వేటగాని వేటుకు గుండె మెలిపెడుతుంటే బిక్కు బిక్కు మంటుంది

ఎవరికేం హాని చేసింది .....ఎవరి ప్రేమ కావాలనుకుంది
మంచిమాటలతో మచ్చిక చేసేది , అరచేతుల్లో పెట్టి లాలించేది
కమ్మని శరీరం కోసం అని తెలి

యదు గా పాపం
పిచ్చి పావురం మృగానికి మచ్చికైయింది ..మరణయాతన పడుతుంది

పలకరింపుకే పులకరించే అల్పసంతోషి
అయినవారిని కాదని మేధావిమనిషి సరసన చేరాననుకుంది
మురిసిపోయింది

బ్రతుకును బలికోరే బోయవాడని తెలియక నమ్మి వచ్చింది
ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తుంటే ఏమని సముదాయించను
గూడు చెదిరి బెదురుతున్న బంగారుతల్లిని ఎలా ఓదార్చను

మంచితనం మాయమైందని, మ్రగతనమే మనిషితనమైనదని
ఎలా చెప్పను పిచ్చిమాతల్లికి
ఏమని బుజ్జగించను ఈ బుజ్జి పావురాన్ని !!

ప్రేమ పేరుతో చేసే మోసం దారుణం.. అది చేసే గాయం నరకం


Sunday, 25 November 2012

దారి తప్పకు అన్నా !!

పేదవాడిని పీక్కుతినే, రాబందుల రెక్కలు విరిచిన
ఆశయం అనే ఆయుధం పట్టుకున్న అన్నవి నీవు ....

ప్రగతిదారిలో నడిచే నీపాదం
వెన్నెలదారిని ఏల ఎంచుకుంది ?

ఆశయాల అంభుదిని ఈదే నీవు
అందాల అలలతో ఏల ఆడేవు ?

ఆదర్శాల కోసం పోరాడే ధీరుడువి
అతివల అలకలకు ఏల దడిచేవు ?

ఆత్మ స్థైర్యానికే అనుంగు పుత్రుడివి
ఇంతి చెంతలేదని ఏల చింతించేవు ?

నువ్వు అన్నట్టు నీదారి వెన్నెలదారే, కానీ
నిశీధి లో సైతం వెలుగులు చిమ్మే సుర్యుడివి నువ్వు
పొద్దు వికశించి రాత్రి వాడిపోయే పద్మాలకోసం
మసకబారనీయ్యకు నీఆశయం

నీ కలం వలపు వెన్నెలలు కురిపించటానికి కాదు
నీ ఆరాటం అర్పించే కలువల కోసం కాకూడదు

రక్తంచిందినా ఆశయం వదలని ధీశాలివి నీవు
నేను సైతం నీ ఆశయంలో చేయి కలపాలనుకున్నా !!
...........నీబాట నడవాలనుకున్నా !!
...........దారి తప్పకు అన్నా !!

Thursday, 22 November 2012

'భారత మాత'' .....స్వాతంత్రం ..........



  • ‎''భారత మాత'' .....స్వాతంత్రం ..........
    మువ్వన్నెల జెండాని 30 అడుగులు పైకెగరేసి తలెత్తి చూసి కొట్టే శాల్యుట్...చాక్లెట్ సరదాలకే పరిమితమా !!

    కల్తి విత్తనాల నుంచి
    నకిలీ ఎరువుల నుంచి
    కరెంట్ కోతల నుంచి
    కనీస గిట్టుబాటు ధరల నుంచి
    మన ''రైతు'' కి వచ్చిందా స్వాతంత్రం .....మిగిలిందా స్వాతంత్రం !!

    బ్రూణ హత్యల నుంచి
    వరకట్న చావుల నుంచి
    ప్రేమోన్మాదుల యాసిడ్ దాడుల నుంచి
    గృహ హింస నుంచి..మాన ధనుల అమ్మకాల నుంచి
    మన మహిళా కు వచ్చిందా స్వాతంత్రం ....మిగిలిందా స్వాతంత్రం

    తీవ్రవాదులు సృష్టించే రైలు ప్రమాదాల నుంచి
    బస్సు దహనాల నుంచి
    తీవ్రవాదుల దాడుల నుంచి
    అధికారుల నిర్లక్ష్యం నుంచి
    మన ''సామాన్యుడికి'' వచ్చిందా స్వాతంత్రం....మిగిలిందా స్వాతంత్రం !!

    రాజకీయ నాయకుల అవినీతి నుంచి
    ప్రభుత్వ నిర్లక్ష్యపు ధోరణి నుంచి
    అడుగడుగునా అల్లుకున్న అవినీతి కారు మబ్బుల నుంచి
    ఆకలి మంటల తో చస్తుంటే నల్లదనం వెక్కరింతల నుంచి
    భారత పౌరునికి వచ్చిందా స్వాతంత్రం .....మిగిలిందా స్వతంత్రం !!

    మూఢ విశ్వాసాల నుంచి
    భావ దారిద్రం నుంచి
    దొంగ బాబా ల నుంచి
    తల్లి రొమ్ము గుద్ది మతాన్ని అమ్ముతున్న విదేశి ధనం నుంచి
    సగటు మనిషి కి వచ్చిందా స్వాతంత్రం ....మిగిలిందా స్వాతంత్రం !!

    త్యాగ ధనుల ....అమర వీరుల బలి దానాలకు ఫలితం ఇదేనా !!
    ఇదేనా స్వతంత్రం ....మిగిలిందా స్వతంత్రం !!

మహల్లో కోయిల

ఆకాశాన్ని తాకాలని
ఆశ పడ్డావ్ కానీ
నా మనసు లో ఎగిసే
భావాల్ని కుడా చేరలేక పోయావ్ !!

బ్రతుకు సంద్రాన్ని గొప్పగా
ఈదాలని ఆరాట పడ్డావ్ కానీ
నీ విరహం తో తడిచిన
నా గుండె తడి ని చూడలేక పోయావ్ !!

నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసే విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ !!

అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిల నే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో !!
***** ప్రియ కారుమంచి *****

ప్రేమ

ప్రేమ పడకేసింది శాశ్వతం గా ...
స్వార్ధం చేతిలో చావు దెబ్బ తింది గా !!
ఎప్పుడు యుద్ధం లో పోరాడి పోరాడి అలసిపోతుందేమో
ప్రాణమున్న జీవచ్చవం లా మారి పోయింది !!

ప్రాణం ...సర్వం అన్న నోటితోనే తనకు
సమాధి కడుతుంటే తెల్లబోయి చూస్తుంది ..
తెల్లవారక ముందే తలపు తట్టే తీయని పలుకులు
రోజు ముగిసినా వినబడ పోతె తల్లడిల్లి చూస్తుంది

దుమికే జలపాతం నీ నవ్వు ..కోయిల గానం నీ పాట అన్న నోటి తో
చేదు గుళికలు నీ పలుకులు అంటుంటే విస్తు పోయి చూస్తుంది

వెన్నెల చల్లదనం నీ చక్కదనం ...మరుమల్లెల పరిమళం నీ సోయగం
అన్న స్వార్ధం నిడిన మనిషి అవసరం తీరిన మరుక్షణం
నువ్వెవరో ...నేనెవరో అంటుంటే నివ్వెర పో యి చూస్తుంది ..

పాపం ఏం చేస్తుంది
స్వార్ధానికి బలమేక్కువ ...ప్రేమ కి విలువెక్కువ
బలం ముందు విలువ చిన్న బోయింది
ప్రేమకి స్వార్ధానికి లంకె కుదరదని తెలుసుగా !!

చావు లోమాత్రం అలసి పోకుండా రోజూ చస్తూనే ఉంది ...చచ్చి బ్రతుకుతూనే ఉంది ...
ఎప్పుడో శాస్వితం గా చచ్చి పోతుంది పిచ్చి ప్రేమ ఈ లోకం మీద అసహ్యం తో .....
.................................................................ప్రియ.....కారుమంచి .....

జీవితం

అమ్మ కడుపున ఉన్న
ఉమ్మనీటి సాగరాన్ని చేధిస్తే
బిడ్డ జననం

బిడ్ద భుజం మీది
కుండ పగిలితే
అమ్మ మరణం

నీటి నుండి బైట పడ్డ చేపలా
కష్టాలూ , కడగళ్ళూ
ఊపిరాడని తనాలూ

అప్పుడప్పుడూ ,మదిని తాకుతూ
సన్నిహితాలూ , స్నేహాలూ,
వెలుగుల కిరణాలు.

నీదీ నాదీ అనే ఆరాటాలూ,
నీవా,నేనా ,అనే ఉరకలూ,
పోటీల పరంపరలూ.

జనన మరణాల మద్య
దోబూచులాడే ఊపిరేగా
ఈ ...... జీవితం.......

.......ప్రియ కారుమంచి .......

నా సమాజం



  • ప్రియ కారుమంచి //

    గుళ్ళో దేవేరికెందుకో వేల కోట్ల నగలు?
    ఆ మెట్ల మీద బిచ్చగాళ్ళకి మాత్రం
    నిత్యం కడుపుమంటలే !!

    బిచ్చగత్తె జోలెకు కట్టిన పసిపాప నేనెవ్వరికీ ముద్దురానా?
    అని జాలిగా చూస్తున్నట్టు ఉంటుంది నాకంటికి...

    ఆ పన్నెండేళ్ళ చిరుగుల గుడ్డల చిన్నది
    రెపరెపలాడే పట్టుచీరల దగ్గర చెయ్యిచాపి పైసలు అడుక్కుంటుంటే
    పక్కనున్న తోడేళ్ళు చిరుగుల సందులను ఆకలిగా తడుముతున్నా
    అర్ధం కాని పిల్ల అసహాయత కనపడుతుంటుంది నా కంటికి...

    ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు,
    చేసిన పాపాలన్నీ పోతాయ్ అని ఆత్రపడే మనుషులను చూసి
    రోజూ గుడి అరుగుమీద డొక్క వీపుకంటుకుని
    చలికి వణుకుతున్న ముసలి అవ్వ
    నవ్వుకుంటున్నట్టు ఉంటుంది నా కంటికి...

    అమ్మా! అనుకున్న పని అయిపోయింది నీ మొక్కు తీర్చటానికి వచ్చా తల్లీ
    అన్న బిడ్డలను మొక్కుల సంగతి తరవాత,
    వచ్చే దారిలో నీ తోటి వాళ్ళ కష్టం ఒక్కటీ నీ కళ్ళబడలేదా !
    అని మూగగా అడుగుతున్నట్లు ఉంటుంది ఆ అమ్మ నా కంటికి...

    ప్రియ కారుమంచి
    16 / 10 /2012....

Tuesday, 20 November 2012

కరగని స్వప్నం ....


ప్రియ కారుమంచి // కరగని స్వప్నం ....

మనిషితనం అంటే మాయతనం అనుకున్నా
నిన్ను చుసాకేగా తెలిసింది మంచితనం అని


అంతా స్వార్థమని అన్నీ కలుషితమని
భయంతో బెదిరే నా కళ్ళకి

బాధతో కుమిలే నా గుండెకి
రంగుల ప్రపంచాన్ని చూపిస్తావు
కలల లోకాన్ని సృష్టిస్తావు
కల్లోలాన్ని కడిగేస్తావు

నిశ్శబ్ద నిరుత్తరురనై నిశీధి లో నేనుంటే
అక్షరతంత్రులను మీటి భావాన్ని వెలిగిస్తావు
భావాన్ని పంచుకుందామని కవిత్వం రాసుకుందామని
కలం పట్టిస్తావు
పదం పలికిస్తావు
జీవన రాగం పాడిస్తావు

కలవరంగా నేనుంటే కవితలా అల్లుకుంటావు
ఆవేశం అస్త్రమైతే ఆలోచన అక్షరమంటావు

అమ్మ చూపే ఆత్మీయత , నాన్న చూపే ఆప్యాయత
తోడై కదిలే అడుగుల వాస్తవికత
ప్రేమై కురిసే చూపుల ఆస్తికత
అన్ని వర్ణాలను ఏకాక్షరం చేసి
నా ముందు నిలబడతావు

నీవొక కరగని స్వప్నం

21 /11 / 20012


నువ్వు ....నేను

నిర్జన ప్రదేశాన నిలకడ లేని
అంతరంగ తరంగ తలపులతో నీవు,
కలల కడలిని కళ్ళలో నింపుకొని నేను.

నిరంతర వేదనతో నిసీది కౌగిలిలో నీవు.
అంతులేని ఆవేదనతో నిను చూస్తూ నేను.

జంట తరువుల చెంత మనం గడిపిన క్షణాలను తలపోస్తూ నీవు.
ఒంటరినై తనువంతా అశ్రుకణమై నేను.

భిరువై బతుకు కుదవ పెట్తున్న వెతవై నీవు
చేరువై బతుకు పండించుకోలేని స్తితిలో నేను.

ఓడిపోయి, ఒంటరిగా విలపిస్తూ నీవు,
నిను వీడిపోయి, ఆత్మనై అలమటిస్తూ నేను.

ప్రేమ పిరికిది కారాదనీ, ప్రేమకి కులం అడ్డు కాదనీ..
గగనమంత కళ్ళతో ప్రేమికులకు సందేశమిస్తూ నేనూ.....

Sunday, 11 November 2012

నేను స్త్రీని ....


నీవు చేసిన ద్రోహం పదే పదే తలపుకు వస్తుంది.
ఇన్నాళ్ళూ నేను దాచుకున్న ఓరిమి ఆరిపోయింది,
ఏమి చేద్దాం నేను భూమి పుత్రికను కానుగా.

ఈ ఛేదు వాస్తవాన్ని మరిచిపోదాం అనుకున్నా,
కలోనైనా నిను చూద్దామని ఆరాటపడుతున్నా,

నిదురతో విరహాన్ని జయించటానికి ఊర్మిళను కానుగా

గుండె బరువుతో నీ రాకకై ఎదురుచూస్తూనే ఉన్నా
నీవేప్పటికీ నా గుండె తలుపు తట్టవు అని తెలిసినా ,
ఎదురు చూపులు ఎదను పిండినా అభిసారికను కాలేనుగా

పంతాలతో నిను కట్టి పడేద్దాం అనుకుంటా
గీత గీసి నిను కట్టడి చేసి, ఆరడి చేద్దాం అనుకుంటా.
సాధించి నిను చేరటానికి సత్యభామను కానుగా

నీ గుప్పెడు మనసులో స్థానం పొందలేని దాన్ని,
గంపెడు ఆశ తో నిత్యం నిను స్థుతించే ప్రేమమయిని
పిచ్చిదాన్నిబండను మలచాలి, కొండను తోలచాలనీ ,
వ్యర్ధ ప్రయతం చేసే వెర్రిదాన్ని.