Sunday, 26 May 2013

ప్రకృతి ..నేను //

ప్రియ కారుమంచి // ప్రకృతి ..నేను //
3 /12 / 20012

ప్రకృతే .........పాఠశాల

పరిసరాలే.... పుస్తకాలు !

కడలి కెరటం చెప్పింది
పడేది మళ్లీ లేచెందుకేనని !

దుమికే జలపాతం చెప్పింది
కిందపడ్డా ముందుకు సాగెందుకేనని !

కదిలే నది చెప్పింది
గమనం గమ్యం కొరకేనని !

సప్తవర్ణాల హరివిల్లు చెప్పింది
రంగులలోకం నిజం కాదని !

నిశిరాత్రి చందమామ చెప్పింది
చీకట్లో చిరుదీపం కమ్మని !

మెరిసే నక్షత్రాలు చెప్పాయి
మంచి నేస్తాలని పెంచుకొమ్మని !

పచ్చని అడవి చెప్పింది
కుందేళ్ళ తో పాటూ తోడేళ్ళూ ఉంటాయాని !

పాడే కోయిల చెప్పింది
మనసు తో మాటాడాలని !

నాట్యమాడే మయురం చెప్పింది
ఆనందం నాలోనే ఉందని !

ఎగిరే గువ్వ , ఈదే చేప ఇలా అన్ని చెప్పాయి
నింగి ఎత్తు , సంద్రం లోతు చూసి భయపడోద్దని !

కురిసే వానచినుకు చెప్పింది
చివరికి చేరేది మట్టిలోకేనని !

ప్రకృతి మాత్రం తన మనసు విప్పి అన్నీ చెప్పింది నాకు
సాటి మనిషి మనసు మాయా , మర్మం మాత్రం
..........నాకు తెలియటంలేదు........ !!

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.