ప్రొద్దుతిరుగుడు పువ్వు ప్రొద్దున్నే పడమరకు మొహం తిప్పుకుంటే
తప్పు నింగిన వెలిగే సూర్యుడుదా !!
మొహం చాటేసిన ప్రొద్దుతిరుగుడు పువ్వుదా !!
సంస్కృతి , సంప్రదాయం పేరుతో కట్టడి చెయ్యాలనుకుంటే
తప్పు ప్రేమ తో కట్టిపడేస్తున్న విలువలదా !!
కట్టుబాట్లనొదిలి కట్టలు తెచ్చుకోవాలను కునే స్వేచ్చదా !!
హాస్పటల్ బెడ్ మీద దిక్కులేని తల్లి రోదిస్తే
తప్పు కపటం లేని అమ్మతనానిదా !!
నిలువెల్లా స్వార్ధం నింపుకున్న బిడ్డలదా !!
వెన్నుపోటు తట్టుకోలేని నాయకుడు కుప్పకూలితే
తప్పు మంచితనం మూర్తీభవించిన నాయకుడిదా !!
నమ్మకాన్ని తూట్లు పొడిచిన అనుచరులదా !!
నీ అడుగులో అడుగు వేసేది నిజమా !!
నిన్ను పట్టి వెనక్కు లాగేది నిజమా !!
మనిషిలో స్వార్ధం చూస్తే వొళ్ళు జలదరిస్తుంది
ఏమవుతుంది ముందుతరం
విలువలు పాతరేసి కట్టిన సమాధిలో
ఊపిరాడక విలవిలలాడుతుందేమో !!
ప్రకృతి కూడా సిగ్గుపడి దిశ మార్చుకుంటుందేమో !!
మాతృత్వం మాయ తెగగానే మాయమవుతుందేమో !!
అమ్మతనం ఎడారిలా మారిపోతుందేమో !!
.........ప్రియ కారుమంచి ...............
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.