Sunday, 26 May 2013

శ్రీ శ్రీ

మరో ప్రపంచం మరోప్రపంచం అంటూ 
మహాప్రస్థానం వైపు అడుగులు వేయించావ్ 

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను 
నేను సైతం విశ్వ సృష్టికి అశ్రువొక్కటి ధారపోశానంటూ జయభేరి మ్రొగించావ్ 

కుక్కపిల్ల , అగ్గిపుల్ల , సబ్బు బిళ్ళా
హీనంగా చూడకు దేన్నీ కవిత్వమేనోయ్ అన్నీ అని నినదించావ్

కూటికోసం ,కూలికోసం పట్టణంలో బ్రతుకుదామని
తల్లిమాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి దారి చూపించావ్

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్థం పరపీడన పరాయణత్వం అని దేశ చరిత్రలను ఎండగట్టావ్

అంతేలే , పేదల గుండెలు అశ్రువులే నిండిన కుండలు
స్మశానమున శశికాంతులలో చలిబారిన వెలిరాబండలు అంటూ పేదల గురించి రాశావ్

ఓ మహాత్మా ! ఓ మహర్షి!
ఓ శ్రీ శ్రీ !!!!
నువ్వు ఏం రాసినా , ఏం నినదించినా ,
నీ సందేశం , నీ విప్లవం ,నీ సంగీతం ,
సదా మాకు స్పూర్తి ....

....... ప్రియ కారుమంచి ........

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.