Sunday, 26 May 2013

మాత్రు బాష


మాతృభాష తల్లి తో సమానం ....

ఈ నినాదం ఈ మద్య బాగా వాడుకలోకి వచ్చింది కదా !!

అసలు భాషకీ, తల్లికీ సంబంధం ఏంటి ?

ఉంది… ఖచ్చితంగా భాష కన్నతల్లి లాంటిదే ....


నీ పుట్టుక కి కారణం అయిన తల్లి లేకపోతే నువ్వు అనాధవి ....

నీ మూలం నీకు తెలియదు , నీ కుటుంబ చరిత్ర నీకు తెలియదు

అలాగే, మాతృబాష చచ్చిపోతే ,

నీ చరిత్ర నీకు తెలియదు....
నీ మూలాలు నీకు తెలియవు
నీ సంస్కృతి నీకు తెలియదు
నీ సాహిత్యం నీకు తెలియదు

పరాయిబాష నేర్చుకున్నవు కదా అని పరాయి సంస్కృతి నీది కాలేదు .
నీకంటూ ఒక అస్తిత్వం మిగలదు ...నేర్చుకున్న పరాయిభాష తో నీ సంస్కృతి నీకు తెలియక , పరాయి సంస్కృతి కి అలవాటు పడలేకా ,అనాధలా మిగిలిపోతావ్ ...

తెలుగు చచ్చిపోతే ఏదో తెలుగుతల్లి బొమ్మకి ప్రాణం పోయినట్టు కాదు ...

మన తెలుగు చచ్చిపోతే వేమన శతకం చచ్చిపోతుంది
మన తెలుగు చచ్చిపోతే శ్రీ .శ్రీ విప్లవం చచ్చిపోతుంది ...
మన తెలుగు చచ్చిపోతే చలం స్వేఛ్చ చచ్చిపోతుంది ...
మన తెలుగు చచ్చిపోతే మన విలువైన సాహిత్యం చచ్చిపోతుంది ..

భాషని చంపుకుంటే , తల్లి లేని అనాధలం అవుతాం
దయచేసి తెలుగు తెలుసు అని చెప్పుకోవడానికి సిగ్గుపడకండి
మన మాతృభాష లో మాట్లాడడానికి గర్వపడదాం ....
తెలుగు వారితో ఆత్మీయంగా తెలుగే మాట్లాడదాం .....
...............................................ప్రియ కారుమంచి ....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.