Sunday, 26 May 2013

రాజకీయ ముఖ చిత్రం

రాష్ట్ర కళాభారతి ఆడిటోరియంలో నాయకుల నిరంతర నాటకాన్ని చూడటానికి ప్రజలు కిక్కిరిసిపోయి ఉన్నారు ...

కొంతమందిలో ఏం జరుగుతుందో అని నరాలు తెగే ఉత్కంట ,
కొంతమందిలో హా ! ఏం జరుగుతుందిలే అన్న ఉదాసీనత ..

వేదిక రంగురంగుల పువ్వుల తెరతో అందంగా అలంకరించబడి ఉంది ..

వేదిక వెనుక చిన్న చిన్న రౌండ్ టేబుల్స్
వాటి చుట్టూ అన్ని పార్టీలకు చెందిన నాయకా నాయక గణం
మందు, ముక్కా పంచుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ...

నాటకం మొదలవగానేఅటువైపునుంచి కొంతమంది , ఇటువైపునుంచి కొంతమంది స్టేజ్ పైకి వచ్చిన నాయకులు ఉత్స్తాహంగా, ఉక్రోషంగా, ఉద్రేకంగా, ఉల్లాసంగా,రకరకాల హావభావాలతో నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు .....

ఇంతలో ఒకవైపు నుంచి ఆల్ పార్టీస్ రంగకుమారి స్టేజ్ మీదకు వచ్చి కళ్ళు తుడుచుకుంటూప్రేక్షకులను సెంటిమెంటు లో ముంచేసి ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నారు ...

ఇంకోవైపునుంచి అక్క దుర్గా భావాని కుమ్మేయండి , కొట్టేయండి అని అందరిని ఎంకరేజ్ చేస్తూ ఆయాసపడుతున్నారు .....

మధ్యలోనాయకుల అండ తప్పా ఎప్పుడూ ప్రజల మొహం ఎరుగని సిల్కులు , షకీలాలు తమతమ డాన్సులతో కవ్విస్తూ ప్రయాసపడుతున్నారు ..


ఇక నాయకుల సంగతి చెప్పేదేముంది ప్రజలను మోసం చేసే నటనలో ఆరితేరి పోయి ఉన్నారు ...

వేదిక మీద ఒకరికొకరు అందరు ప్రత్యర్దులే
వేదిక వెనుక అందరూ స్నేహితులే ..

ఇదంతా చూసే ప్రజలే పిచ్చివాళ్ళు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ....

..................................ప్రియ కారుమంచి .............

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.