మార్పు రావాలంటే ప్రభుత్వం నుంచే రావాలి అంటూ ఉంటాం. అయితే ప్రభుత్వం ఎప్పుడో కులాంతర వివాహాలను, మతాంతర వివాహాలనూ సమర్దించింది, మరి మనలో ఏది ఆ మార్పు? వలువలని కాకా, కులాన్ని, డబ్బుని కప్పుకొని తిరుగుతున్నాం అనిపిస్తుంది ...
తెలిసీ తెలియని వయసులో , ప్రేమ అనుకొని గడప దాటిన ఓ ఆడపిల్ల అయిన వాళ్లకు దూరమై.. కట్టుకొన్న వాడికి భారమై తాను అనుభవించిన బాధని ,నాకు ఈ ఉత్తరం ద్వారా తెలిపి, అది నన్ను చేరేలోపే ఆత్మహత్య చేసుకున్న ఒక చెల్లి కధ ఇది ...
ప్రియా అక్కా !
నాకు మా ఊరిని, మా ఇంటిని మా వాళ్ళందరిని చూడాలనిపించింది ..
చాలా రోజుల తరువాతా నేను మా ఊరు వెళ్లాను .....అప్పటిదాకా నాకే తెలియలేదు ఆ ఊరు అంటే నాకింత ఇష్టం ఉందని ...
" ఎందుకో ఆ ఇంటి ముందుకు వెళ్తూనే నా అడుగులు తడబడ్డాయి , నడక నెమ్మదిగా మారుతుంది, వద్దు అనుకున్నా.. ఆ ఇంటి ప్రాంగణం నన్ను పిలుస్తుంది. నా బాల్యం లోని మా అక్కల గోటి గాట్లు చురుక్కుమని నన్ను గుచ్చుకున్నట్లు, ఆ వరండా మెట్ల మీద కూర్చుని ఇంకా నేను పాటలు పాడుకున్నట్టే అనిపించింది ..
నేను అమ్మతో పంచుకొన్న కబుర్లూ, అక్కల గిల్లికజ్జాలూ, ఇంకా నన్ను వెంటాడుతాన్నాయి, ఏదైనా మంచి పనిచేసి నాన్న మెప్పు పొందాలనుకొని నేను పడిన పాట్లూ ఇంకా వెంటాడుతున్నాయి
నచ్చిన స్నేహాన్ని జీవితాంతం పక్కన ఉంచుకోవాలంటే, రక్త సంబంధాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుందని నేను ఊహించలేదు.అప్పుడు
ఇప్పటికీ, నా గుండెల్లో ఉన్న ప్రేమని అదే రక్తం ఎందుకు తిరస్కరిస్తుంది. ఆ రక్తం రంగు మార్చుకుందా? లేక నేను ఎంచుకున్న కులపు రంగు వారి బుద్ధి మార్చుకోమందా ?
అదే, ఊరు, అదే మనుషులు, అదే బంధాలు. మరి ఎక్కడ మార్పు వచ్చింది? నేను తిరుగాడే ప్రాంగణాన్ని వీడి పొమ్మనే అధికారం వారికి ఎక్కడిది? ఆస్తి కోసం కుక్కల్లా కాపలా కాసే వారికి నా ఆత్మీయత అర్ధం అవుతుందా?
కాదు, కానే కాదు ఈ కులాంతర వివాహాలలో.. అడ్డు కులమే కాదు ఇంకా చాలా ఉన్నాయి, అమ్మతనాన్నే అమ్ముకొనే శక్తి వెనుక ఇంకా ఏదో ఉంది? తోడబుట్టిన చెల్లిని కూడా త్రోసిపుచ్చే పుచ్చుతనం వెనుక ఇంకా ఏదో దాగి ఉంది. వదలి పొయింది ..ఆస్తి మిగిలి పొయింది అన్న సంతోషం వాళ్ళ దృష్టి లో నన్ను చంపేసింది ...ఇంటిముందుదాక వెళ్ళిన నేను లోపలి వెళ్ళకుండానే వెనుదిరగాల్సి వచ్చింది ...వాళ్ళు చంపేసింది నా బాల్యాన్ని పుట్టిపెరిగిన ఊరిలో నా గుర్తులను , నా పూర్వ జీవితాన్ని , నా జ్ఞాపకాలను , నా బంధాలను ,
టి.వి. సీరియళ్ళలో ఆడ విలన్లను చూసి అసహ్యించుకునే దాన్ని, కానీ ఈ మద్య వారి వెనుక ఉన్న అసలు పాత్రలను చూస్తున్నాను .
గొంతెత్తి అరవాలని ఉంది, . పేగు బంధాలలో కూడా తెగులు వస్తుందని, ఆ తెగులుకు మందు వెతుక్కుంటూ.. ఇంకో కొత్త జబ్బులను కనుగొనే నాలో మనుషులంటేనే అపనమ్మకం కలుగుతుంది."...

No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.