Thursday, 10 November 2016

...స్వాగతం .....

ప్రొద్దుటే మొదటిసారి
మొహం మీద చిలకరించుకునే నీళ్ళలా
రాత్రి బుజ్జగించి బజ్జోపెట్టిన జ్ఞాపకాలు
జివ్వున నిద్ర లేస్తాయి

కంటి రెప్పల వెంట్రుకల మధ్య
చిక్కుకుపోయిన నీటి బిందువుల్లా
అద్దంలో నిన్నటి తలపులు
స్వచ్చంగా చిర్నవ్వుతాయి

గాజు పాత్రలో రంగురాళ్ళ మధ్య
నీళ్ళల్లో నిలబెట్టిన వెదురు మొక్క
గాలికి ఆకుపచ్చగా ఊగుతూ
నేటికి స్వాగతం అంటుంది...

మరి అద్దంలో
ఇంకొక రోజు మొదలైంది
నిన్నని కొనసాగిస్తూ ....

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.