Thursday, 10 November 2016

(.......)

మనుషులు మనుషుల మధ్య ఆనందాన్ని వెతుక్కోవడం అ౦టే,
.....అనంతమైన ఆకాశంలో
రెక్కలు చాసి మేఘాలతో పోటీ పడుతూ నింగికి ఎగరాల్సిన పక్షి
నేలమీద, గడ్డి పరకల మధ్య, పురుగుల కోసం వెంపర్లాదాటం లాంటిదే ..కదా .

ఈ గడ్డి పురుగుల మధ్య
లోకంలో ఉన్న పూల సౌరభాన్నంతటనీ ఇంకించుకుని వికసించిన
గడ్డిపూవు సౌందర్యాన్ని స్వప్నించిన ఆనందం నాది ..

ఈ మనుషుల మధ్యలో
జీవ కాంతితో మెరిసిపోతున్న ఒక అద్భుతాన్ని కనుగొన్న క్షణం అది

అందుకే,
ఉండనివ్వు ఆ స్వప్నాన్ని
అలా శాస్వితంగా ..
సరేనా !...

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.