Thursday, 10 November 2016

....మళ్ళీ తిరిగి మొదలెడదాం ...

ఆగిపోయిన చోటునుండే
మళ్ళీ తిరిగి మొదలెడదాం

మెత్తటి పావురాళ్ళ రెక్కలపై
రాసుకున్న రాయబార లేఖలతో

మసక చీకట్లో దీపాన్ని వెలిగించే
కాంతిపుంజ వలయాలతో

సౌగంధికా పూతీవెలపై
మంచు తుంపర లాంటి చెలిమి స్వప్నాలతో
ఇంధ్ర ధనుస్సుకి కొత్త రంగులద్దినట్టు
నిన్నని నేటితో కలిపి కొమ్మా కొమ్మా అల్లుకుంటూ

ధారగా కురుస్తున్న నిశ్శబ్దంలో
కొన్ని పదాల పడవలు జారవిడిచి
ఆగిపోయిన చోటునుండే
మళ్ళీ తిరిగి మొదలెడదాం..
సరేనా !

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.