Monday, 4 November 2013

అంతా నిశ్శబ్దం .....



అంతా నిశ్శబ్దం________________________

ఒక కర్ణ కఠోరమైన శబ్దం తరవాత ముసురుకున్న నిశ్శబ్దం

కాకులు కూడా భయం నీడల్లో చెట్ల కొమ్మల్లో ముడుచుకు కూర్చున్నాయి 
వీదికుక్కలు ఉనికి తెలియకుండా నిక్కి నిక్కి చూస్తున్నాయి 

భయం తాలూకు నిశ్వాసలతో గాలి కూడా గడగడలాడుతుంది
ఎటుచూసినా ఎర్రని రక్తపు మరకలు పగిలిన గాజుపెంకులే

పక్కింటి భయ్యా కన్నీటి పొరల మాటున కసి తీరిన ఆనందం

మొన్నటి నుంచి చంటిది అడుగుతునే ఉంది
భయంతో గుండెల కదుముకుని నోరుమూసినా
వణుకుతున్న కంఠ౦తో అదేపనిగా అడుగుతూనే ఉంది

ఎందుకమ్మా పక్కింటి అంటి ఏడుస్తూనే ఉంది
ఎందుకమ్మా అంకుల్ కుర్చీని అంటి మీదకు తన్ని
రక్తమొచ్చేలా గోడకేసి తలకొట్టుకున్నారు

చెప్పమ్మా ఆంటికి ఏంజరిగింది !!
చెప్పమ్మా ఆంటికి ఎం జరిగింది !!

ఏం చెప్పాలి నా చిట్టితల్లికి

ఈ దేశంలో మతమెక్కిన లం .....కొడుకులు ఆడదాని కన్నీటికి కారణమని

ఏం చెప్పాలి తనకు

చేతకాని సన్నాసులు పరాక్రమం ఆడవాళ్ళ చీరలు లాగటంలో చూపిస్తారని

మారణ హోమాలూ , మానభంగాలూ
మరణం తరవాత నిశ్శబ్ధాలూ ఈ దేశంలో నిత్యక్రుత్యమని

ఎలా చెప్పాలి తనకి__________________________ప్రియ

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.