ఎందుకిలా .
------------------------------ ---------
గాయాలెన్నవుతున్నా మౌనం వీడకుండా ఇంకెన్నాళ్ళు
నువ్వంటావూ, నీ సంకెళ్ల తెంపుకుని అందరికి సంకెళ్ళేస్తున్నావు అని
మాటలతో తూట్లు పడుతున్న నీ అందాల పొదరిల్లు చూడు
చూడు.. రక్తమోడుతున్న నీ స్థానాన్ని చూడు...
చుట్టూ అద్దాలు పెట్టుకుని లోకాన్ని చూస్తూ నాపాటికి నేనున్నానా
ఎటుచూసినా వెకిలి నవ్వులే , వెర్రి చూపులే కంపరమెత్తుతూ
కళ్ళింత చేసుకుని అడ్డుగా ఉన్న అద్దాన్ని తిట్టుకుంటూ కొందరు
అడ్డేమీ లేదనుకుని అందుకోవాలని ఆరాటపడే వెర్రితనంతో కొందరు
అందితే విరజాజి పువ్వు, అంద లేదా గులాబీ ముళ్ళు
ఇప్పుడు చెప్పు నా సంకెళ్ళు తెంపుకోవడం సాద్యమా ?
నాకు ఈ విశాల ప్రపంచంలో స్వేచ్చగా విహరించాలని ఉంది
------------------------------

అడుగడుగునా ఎదురయ్యే ఆకలి చూపులు చేధించాలని ఉంది
Really Nice priya.
ReplyDelete