ఎండుటాకులు .....
.......
ఒక్కసారిగా వీచిన ఈదురుగాలికి
గర్వంగా ,అహంకారంగా అజ్ఞానంగా మరికొన్ని ఒద్దికగా ఉన్నవి
ఇన్నాళ్ళూ కొమ్మల్లో కొమ్మగా ఆకుల్లో ఆకుగా కలిసిపోయిన
పండుటాకులు , ఎండుటాకులూ రాలిపడి పోతున్నాయి
హఠాత్తుగా ఇంత పెద్ద హోరు గాలి
ఆకులన్నిటినీ ఒక్కటిగా కలిపి విసురుగా తరిమేస్తుంటే
వేపాకులు మర్రిఆకులు మావిడాకులు తమలపాకులు
అన్నీ కుప్పగా కొట్టుకుపోతున్నాయి
అప్పుడు నాకనిపించింది
పచ్చగా ఉన్నప్పుడే కదా వాటికి రకరకాల పేర్లు
ఇప్పుడు చూడు ఆన్నీఎండుటాకులే
వర్షపు చిత్తడికి కుళ్లిపోయే చెత్తా చదారమే కదా !
గుర్తుందా అప్పుడు నువ్వన్నావు చిరునవ్వుతో నా కళ్ళలోకి చూస్తూ
common darling every life is same ..remember it ..
కులాలు,మతాలు నమ్మకాలూ విశ్వాసాలు అన్నీ ప్రాణం ఉన్నంతవరకే
ఆ ఆతర్వాత అందరం కలిసేది ఆ మట్టిలోనే అని ..
మరి గుర్తుందా నీకు ......

నిజమే కదా.... అందరం ఎండుటాకుల్లాంటి వాళ్ళమే... రాలిపోయే పువ్వులమే... తెలిసి కూడా అన్నీ భేదాలే... ఇది మానవ నైజం
ReplyDelete