Monday, 4 November 2013

నాదొక అందమైన విషాద పుస్తకం

నాదొక అందమైన విషాద పుస్తకం 
__________________________

నెమలీకలుగా నేదాచుకున్న 
మధురోహాల జ్ఞాపకాలు 
గులాబీ రేకుల పరిమళాలై 
ముంచెత్తే మది భావాలూ 

తొలిపొద్దు కిరణాలను చూసి 
ఎగసిపడే చిరునవ్వుల కెరటాలు 
సంధ్య చీకట్లు ముసురుకు
నిరసనగా తెలిపే చిరుకోపాలు

అప్పుడప్పుడూ
నీలాల మీనాల నుంచి
కురిసే వాన చినుకులు
మనసు మబ్బుతెరలూ

శిధిల కోటలో మౌన నిశీధిలో
పగిలిన కిటికీ అద్దంలోనుంచి
లోకాన్ని చూస్తూ కలతపడుతూ
ఇలా నాపాటికి నేనిలుచుంటే

ఇంకా రాళ్ళేయాలని
గునపాలతో గుచ్చాలని
గాయపరచాలని
ఎందుకీ రాతితనం

ఇక్కడ
మాటకి దిక్కులేని వాళ్లకు
దానమిచ్చే సంపద లేదు
మనసులు పంచుకునే
విశాలతత్వం అసలే లేదు

బహుమతిగా రాసిన వెండి కంచాలు
మనసు సందు నుంచి అసలే దొర్లిరావు

ఎందుకంటే ఇది జీవితం
మరి అసలైన జీవితం ...
ఇక్కడ అంతా నిజమే ..

1 comment:

  1. 'సంధ్య చీకట్లు ముసురుకు
    నిరసనగా తెలిపే చిరుకోపాలు' 'శిధిల కోటలో మౌన నిశీధిలో
    పగిలిన కిటికీ అద్దంలోనుంచి
    లోకాన్ని చూస్తూ కలతపడుతూ
    ఇలా నాపాటికి నేనిలుచుంటే' అద్భుతం

    ReplyDelete

Note: only a member of this blog may post a comment.