ప్రేమ
ప్రేమ పడకేసింది శాశ్వతం గా ...
స్వార్ధం చేతిలో చావు దెబ్బ తింది గా !!
ఎప్పుడు యుద్ధం లో పోరాడి పోరాడి అలసిపోతుందేమో
ప్రాణమున్న జీవచ్చవం లా మారి పోయింది !!
ప్రాణం ...సర్వం అన్న నోటితోనే తనకు
సమాధి కడుతుంటే తెల్లబోయి చూస్తుంది ..
తెల్లవారక ముందే తలపు తట్టే తీయని పలుకులు
రోజు ముగిసినా వినబడ పోతె తల్లడిల్లి చూస్తుంది
దుమికే జలపాతం నీ నవ్వు ..కోయిల గానం నీ పాట అన్న నోటి తో
చేదు గుళికలు నీ పలుకులు అంటుంటే విస్తు పోయి చూస్తుంది
వెన్నెల చల్లదనం నీ చక్కదనం ...మరుమల్లెల పరిమళం నీ సోయగం
అన్న స్వార్ధం నిడిన మనిషి అవసరం తీరిన మరుక్షణం
నువ్వెవరో ...నేనెవరో అంటుంటే నివ్వెర పో యి చూస్తుంది ..
పాపం ఏం చేస్తుంది
స్వార్ధానికి బలమేక్కువ ...ప్రేమ కి విలువెక్కువ
బలం ముందు విలువ చిన్న బోయింది
ప్రేమకి స్వార్ధానికి లంకె కుదరదని తెలుసుగా !!
చావు లోమాత్రం అలసి పోకుండా రోజూ చస్తూనే ఉంది ...చచ్చి బ్రతుకుతూనే ఉంది ...
ఎప్పుడో శాస్వితం గా చచ్చి పోతుంది పిచ్చి ప్రేమ ఈ లోకం మీద అసహ్యం తో .....
.................................................................ప్రియ.....కారుమంచి .....
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.