Thursday, 22 November 2012

మహల్లో కోయిల

ఆకాశాన్ని తాకాలని
ఆశ పడ్డావ్ కానీ
నా మనసు లో ఎగిసే
భావాల్ని కుడా చేరలేక పోయావ్ !!

బ్రతుకు సంద్రాన్ని గొప్పగా
ఈదాలని ఆరాట పడ్డావ్ కానీ
నీ విరహం తో తడిచిన
నా గుండె తడి ని చూడలేక పోయావ్ !!

నక్షత్రాల మెరుపుని చూసి
మురిసి పోయావు కానీ
నా మనసే విరబూసిన వెన్నెలైనా
నీ కోసమే అని తెలుసుకోలేక పోయావ్ !!

అయినా ఇది నీ తప్పు కాదులే
నేను నీ మహల్లో కోయిల నే కానీ
నీ నిశీధి గుండెను చేరే
తీయని గానం చేయలేక పోయానేమో !!
***** ప్రియ కారుమంచి *****

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.