Sunday, 25 November 2012

దారి తప్పకు అన్నా !!

పేదవాడిని పీక్కుతినే, రాబందుల రెక్కలు విరిచిన
ఆశయం అనే ఆయుధం పట్టుకున్న అన్నవి నీవు ....

ప్రగతిదారిలో నడిచే నీపాదం
వెన్నెలదారిని ఏల ఎంచుకుంది ?

ఆశయాల అంభుదిని ఈదే నీవు
అందాల అలలతో ఏల ఆడేవు ?

ఆదర్శాల కోసం పోరాడే ధీరుడువి
అతివల అలకలకు ఏల దడిచేవు ?

ఆత్మ స్థైర్యానికే అనుంగు పుత్రుడివి
ఇంతి చెంతలేదని ఏల చింతించేవు ?

నువ్వు అన్నట్టు నీదారి వెన్నెలదారే, కానీ
నిశీధి లో సైతం వెలుగులు చిమ్మే సుర్యుడివి నువ్వు
పొద్దు వికశించి రాత్రి వాడిపోయే పద్మాలకోసం
మసకబారనీయ్యకు నీఆశయం

నీ కలం వలపు వెన్నెలలు కురిపించటానికి కాదు
నీ ఆరాటం అర్పించే కలువల కోసం కాకూడదు

రక్తంచిందినా ఆశయం వదలని ధీశాలివి నీవు
నేను సైతం నీ ఆశయంలో చేయి కలపాలనుకున్నా !!
...........నీబాట నడవాలనుకున్నా !!
...........దారి తప్పకు అన్నా !!

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.