Thursday, 29 November 2012

మృగతనం




దెబ్బతిన్న పావురం మనిషి ని చూస్తేనే బెదిరి పోతుంది
వేటగాని వేటుకు గుండె మెలిపెడుతుంటే బిక్కు బిక్కు మంటుంది

ఎవరికేం హాని చేసింది .....ఎవరి ప్రేమ కావాలనుకుంది
మంచిమాటలతో మచ్చిక చేసేది , అరచేతుల్లో పెట్టి లాలించేది
కమ్మని శరీరం కోసం అని తెలి

యదు గా పాపం
పిచ్చి పావురం మృగానికి మచ్చికైయింది ..మరణయాతన పడుతుంది

పలకరింపుకే పులకరించే అల్పసంతోషి
అయినవారిని కాదని మేధావిమనిషి సరసన చేరాననుకుంది
మురిసిపోయింది

బ్రతుకును బలికోరే బోయవాడని తెలియక నమ్మి వచ్చింది
ఇప్పుడు గుండె పగిలి ఏడుస్తుంటే ఏమని సముదాయించను
గూడు చెదిరి బెదురుతున్న బంగారుతల్లిని ఎలా ఓదార్చను

మంచితనం మాయమైందని, మ్రగతనమే మనిషితనమైనదని
ఎలా చెప్పను పిచ్చిమాతల్లికి
ఏమని బుజ్జగించను ఈ బుజ్జి పావురాన్ని !!

ప్రేమ పేరుతో చేసే మోసం దారుణం.. అది చేసే గాయం నరకం


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.