ప్రపంచాన్నంతా ఒక పక్కకి జరిపేసి
నువ్వూ నేనూ ఒక అంచున కూర్చుని మాట్లాడుకుంటున్నట్లుంది ....
దృశ్యాలన్నీ అదృశ్యమైపోయి
మనమే ఏకైక దృశ్యంగా మిగిలినట్లుంది .....
లోకంలో పరిమళాలన్నీ రెండు పూలలో ఇమిడి పోతే
ఆ పూలలోకి మనం పరకాయ ప్రవేశం చేసినట్లుంది ....
మనం ఎవరి నుంచి ఎవరం ఏమీ కోరుకోలేదని తెలిసీ
ఈ సృష్టి మనతో స్నేహం కోరుకున్నట్లుగా ఉంది ......ప్రియ ....

ReplyDeleteఈ సృష్టి మనతో స్నేహం కోరుకున్నట్లుగా ఉంది ...భావుకత చాలా బాగుంది. వండర్ ఫుల్ లైన్స్
...వాహెద్
అందమైన పరిమళాల అక్షరమాల...ప్రియగారు.
ReplyDeleteప్రియా (ఇది సంబోధన ప్రధమా విభక్తికి చెందిన సన్నిహిత సంబోధన కాదు, మిమ్మల్ని కేవలం పేరు పెట్టి పిలవడం)
ReplyDeleteమీ చక్కని కవిత మీద అభిప్రాయం చెప్పే ముందు, సంబోధన దగ్గరే ఇంత సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది; ఆ కవితని నేను own చేసుకున్న నేరానికి ఇంకా ఎన్ని సంజాయిషీలు ఇవ్వాలో అని జంకుతున్నాను.
మీరు సాధారణంగా కవిత ఎలా రాస్తారో, ఇది ఎలా రాసారో నాకు తెలియదు. కానీ, నేను కవిని పక్కకు నెట్టి కవితని తీసుకోలేదు.
పక్కకు పెట్టలేని నా బలహీనతలోంచి దీన్ని నేనిలా చూసాను:
ధీరత్వం, లాలిత్యాలని సౌందర్యంతో మేలైన పాళ్లలో కలగలిపినట్టు ఉండే మీ వంటి హిమజ్వాల చేత 'ప్రపంచాన్నంతా ఒక పక్కకి జరిపేసి నువ్వూ నేనూ ఒక అంచున కూర్చుని మాట్లాడుకుంటున్నట్లుంది' అనిపించుకున్న అదృష్టవంతుడి గురించి చెప్పరాని అసూయతో (నాతో సహా ) ఎన్నో గుండెలు రగిలి పోయి ఉంటాయని అనుకుంటున్నాను.
ఈ సృష్టే మీతో స్నేహం కోరుకునే గొప్ప unison, ఐక్యత సాధించిన జంట ఈ లోకంలో ఎవరైనా, వారికి సాగిల పడే నేను, అక్షరాభినందనతో ఆ ప్రయత్నం చేస్తున్నాను.
మనసు మురిసే ఏకాంతంలో....హ్రుదయ స్పందన ... అద్బుతహ
ReplyDeleteAdbhutham.....!
ReplyDelete